జాతీయ వార్తలు

జెఐపిఎల్ డైరెక్టర్లు దోషులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: యుపిఏ-2 హయాంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన బొగ్గుకుంభకోణం కేసులో తొలిసారి ప్రత్యేక న్యాయస్థానం ఓ కంపెనీని, దాని డైరెక్టర్లను దోషులుగా నిర్ధారించింది. జార్ఖండ్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ (జెఐపిఎల్), డైరెక్టర్లు ఆర్‌ఎస్ రుంగ్తా, ఆర్‌సి రుంగ్తాలను నేరానికి పాల్పడినట్టు కోర్టు స్పష్టం చేసింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులో జెఐపిఎల్ అవకతవకలకు పాల్పడినట్టు పేర్కొంది. జార్ఖండ్‌లోని నార్త్ ధాడు బొగ్గు గనులను అక్రమ మార్గాల ద్వారా చేజిక్కించుకున్నట్టు ప్రత్యేక కోర్టు తేల్చింది. బొగ్గుగనుల మంత్రిత్వశాఖ, స్క్రీనింగ్ కమిటీని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించారని, కంపెనీ సామర్థ్యానికి మంచి మెసెర్స్ జెఐపిఎల్‌కు కేటాయింపులు జరిగాయని సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాశర్ వ్యాఖ్యానించారు. నిందితులు తప్పుడు ధ్రువీకరణలతో ప్రభుత్వాన్ని మోసం చేశారని 132 పేజీల తీర్పును న్యాయమూర్తి వెలువరించారు. ఐపిసిలోని సెక్షన్ 420 కింద నిందితులపై కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు చేపట్టింది. కాగా బొగ్గు కుంభకోణం కేసులో అరెస్టయిన డైరెక్టర్లు రుంగ్తాలు బెయిల్‌పై ఉన్నారు. వారిద్దరూ సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించే సమయంలో కోర్టు హాలులోనే ఉన్నారు. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ప్రకటించిన వెంటనే దోషులను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ ఈ నెల 31 చేపట్టి ఆ రోజు శిక్షను ఖరారు చేయనున్నట్టు న్యాయమూర్తి భరత్ పరశర్ ప్రకటించారు. బొగ్గు కుంభకోణం కేసులో మరో 19 కేసులు సిబిఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసిన రెండు కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి.