జాతీయ వార్తలు

కాత్యాయని అమ్మకు ల్యాప్‌టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, నవంబర్ 8: కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అక్షరలక్ష్యం’ పథకంలో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో నూటికి 98 మార్కులు సాధించి రికార్డు సృష్టించిన 96 ఏళ్ల కాత్యాయని అమ్మకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రవీంద్రనాథ్ బుధవారం ఒక ల్యాప్‌టాప్‌ను అందజేశారు. చదవడం, రాయడం, ప్రాథమిక లెక్కల్లో నిర్వహించిన పరీక్షల్లో రాష్టవ్య్రాప్తంగా 43,330 మంది పాల్గొనగా అందులో కాత్యాయని అమ్మ అత్యధిక మార్కులు సాధించడం తెలిసిందే. గత వారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెను సత్కరించి పట్టా ప్రదానం చేసినప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలన్న ఆసక్తిని అమ్మ ప్రదర్శించారు. దీనికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ల్యాప్‌టాప్‌ను అమ్మకు అందచేసింది. రాష్ట్రాన్ని వందశాతం అక్షరాస్యతగా తీర్చిదిద్దడంలో భాగంగా కేరళ ప్రభుత్వం ఈ అక్షరలక్ష్యం పథకాన్ని ప్రవేశపెట్టింది.

చిత్రం..96 ఏళ్ల కాత్యాయనికి ల్యాప్‌టాప్‌ను అందజేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రవీంద్రనాథ్