జాతీయ వార్తలు

అవినీతి ఆరోపణలు అసత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి అభియోగాలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ ప్రారంభించింది. గురువారం సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ సీవీసీ కేవీ చౌదరిని కలిశారు. తనపై వచ్చిన అభియోగాలను తిరస్కరించినట్లు సమాచారం. తనపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా చేసిన అభియోగాలను తోసిపుచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సీవీసీ కార్యాలయానికి వచ్చి కేఏచౌదరి, కమిషనర్ శరద్ కుమార్‌ను కలిశారు. సుప్రీంకోర్టు అక్టోబర్ 26వ తేదీన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించిన విషయం విదితమే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీవీసీ రంగంలోకి దిగి విచారణను ప్రారంభించింది. కాగా స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా కూడా సీవీసీని కలిసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీబీఐ డైరెక్టర్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్తానాను కేంద్రం సెలవుపై పంపింది. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న వివాదాల వల్ల సీబీఐ ప్రతిష్ట మసకబారింది.
సీబీఐ కార్యాలయంలో ఇనెస్పెక్టర్ నుంచి ఎస్పీ స్థాయి వరకు అధికారులను సీవీసీ పిలిచి విచారించింది. వారి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. మొయిన్ ఖురేషీ లంచం కేసు, ఐఆర్‌సీటీసీ స్కాం, పశువుల అక్రమ రవాణా కేసులను దర్యాప్తు చేసిన అధికారులను కూడా పిలిపించి వారి అభిప్రాయాలను సీవీసీ సేకరించింది. కాగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తనను సెలవుపై పంపడాన్ని సుప్రీంలో సవాలు చేసిన విషయం విదితమే. దీనికి సంబంధించిన వివరాలను కూడా సీవీసీ సేకరించింది. కాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ కే పట్నాయక్ నేతృత్వంలో కమిటీ ఈ విచారణను పర్యవేక్షిస్తోంది. సీబీఐ గత నెల 15వ తేదీన స్పెషల్ డైరెక్టర్ అస్తానాపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. అలాగే సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్‌ను సీబీఐ అనేక అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసింది. ఈ ఏ డాది ఆగస్టు 24వ తేదీన స్పెషల్ డైరెక్టర్ అస్తానా కేబినెట్ సెక్రటరీకి సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో అలోక్‌వర్మపై అనేక అవినీతి ఆరోపణలు చేశారు.