జాతీయ వార్తలు

నోట్ల రద్దు పెను విపత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆర్‌బీఐని వశం చేసుకోడానికి కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని గురువారం ఇక్కడ ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణమైందని చిదంబరం అన్నారు. డమోనిటైజేషన్ ఓ విపత్తు అంటూ ఆయన నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం తనకు నచ్చివరానికి ఆర్‌బీఐలోకి జొప్పించి, త్వరలో జరిగే సమావేశంలో ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల కోసం ఆర్‌బీఐ నుంచి దొడ్డిదారిని నిధులు మళ్లించేందుకు కేంద్రం కుట్ర పన్నిందని మాజీ ఆర్థిక మంత్రి ఆరోపించారు. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య తీవ్రమైన విభేదాలు తెలెత్తాయని ఆయన తెలిపారు. నిధులు మళ్లింపుకోసం 1934 ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7ను ప్రయోగించాలని మోదీ సర్కార్ చూస్తోందని చిదంబరం ధ్వజమెత్తారు. ఆర్‌బీఐ నుంచి లక్ష కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖజానాకు బదిలీ చేయాలన్నది మోదీ ఎత్తుగడగా కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.‘ ఆర్‌బీఐని నిర్వీర్యం చేయడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తనకు సంబంధించిన వారిని తీసుకుని, ఈనెల 19న జరిగే బోర్డు సమావేశంలో ఆమోదం లభించేలా పావులు కదుపుతున్నారు’అని ఆయన విమర్శించారు. డిమోనిటైజేషన్ ఓ విపత్తుగా చిదంబరం అభివర్ణించారు.

చిత్రం..పెద్ద నోట్ల రద్దు రెండో వార్షికోత్సవం సందర్భంగా గురువారం
కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం