జాతీయ వార్తలు

పన్నులు పెరిగాయి.. ఉద్యోగాలు ఊడాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: పెద్ద నోట్ల రద్దుపై అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య గురువారం తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఆర్థిక వ్యవస్థ బాగుపడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనగా, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సహజ శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2016 నవంబర్ 8వ తేదీన నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం విదితమే. మోదీ సర్కార్ అనాలోచిత నిర్ణయం వల్ల 1.5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని, జీడీపీలో ఒక శాతం తగ్గిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరిగిందని, నల్లధనం చలామణిని అరికట్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉందని, దారిద్య్ర నిర్మూలన, నల్లధనం అరికట్టేందుకు ఏమి చర్యలు తీసుకున్నారో వివరించాలని పది పాయింట్లతో ప్రశ్నలను సంధించారు. మీ ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరంకు ఇప్పుడున్న విశ్వసనీయత ఏమిటని బీజేపీ ప్రశ్నించింది. జైట్లీ ఫేస్‌బుక్‌లో కాంగ్రెస్ ఆరోపణలకు బదులిచ్చారు. 80 శాతం ఆదాయం పన్ను ప ఎరిగిందని, రిటర్న్స్ దాఖలు చేసే వారి సంఖ్య 6.86 కోట్లకు పెరిగిందన్నారు. డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయన్నారు. దేశంలో వౌలిక సదుపాయాలను మెరుగుపరిచామన్నారు. తమ వద్ద ఉన్న నగదు నిల్వలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా చట్ట బద్ధత లేని లావాదేవీలను నిర్వహించే అకౌంట్లను గుర్తించామన్నారు. పన్నుల వ్యవస్థ బాగుపడిందన్నారు. జీఎస్‌టి వల్ల ఒక దేశం, ఒక పన్ను విధానం అమలైందన్నారు. పన్నుల పరిధిలోకి ఎక్కువ మందిని తేవాలన్న లక్ష్యం నెరవేరిందని, నల్లధనం చలామణిని చెక్ చేశామని చెప్పారు. బ్యాంకులు రుణాలు ఇచ్చే స్థితిని పెంచామన్నారు. పెద్ద మొత్తంలో ప్రజలు మ్యూచువల్‌ఫండ్స్‌లో నిధులను డిపాజిట్ చేస్తున్నారని, ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం బాగుందని చెప్పడానికి ఇంతకంటే ఏమి కావాలన్నారు.
ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బదులిస్తూ పెద్ద నోట్ల రద్దు వల్ల ఏటీఎంల వద్ద క్యూలో నిలబడిన 120 మంది వివిధ ఘటనల్లో మరణించారన్నారు. పెద్ద నోట్ల రద్దు ఒక విషాదం అన్నారు. ఇదొక ఘోర తప్పిదమన్నారు. ఆత్మహత్యా సదృశ్యమైన ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది ప్రజల జీవితాలు చీకట్లోకి నెట్టారన్నారు. ఇదో దుర్మార్గమైన, అసంబద్ధమైన చర్య అన్నారు. ఇప్పటికీ పెద్ద నోట్ల రద్దు వల్ల తగిలిన గాయాల నుంచి ప్రజలు కోలుకోలేదన్నారు. కాగా ఆర్‌బీఐ వద్ద ఉన్న 9.6 లక్షల కోట్లను రిజర్వు నిధులను లాగేసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న తీరు వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్నారు.