జాతీయ వార్తలు

అర్ధరాత్రి వరకూ టపాసుల మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య మేఘాలు మరోసారి విజృంభించాయి. వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ నగరంలో దీపావళి రోజు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాలుష్య ఉద్గారాలు తీవ్రరూపం దాల్చాయని అధికారులు వెల్లడించారు. రెండు గంటలు మాత్రమే బాణ సంచాకాల్చాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు ఎక్కడా అమలైన దాఖలాలు కనిపించలేదు.
సుప్రీం ధర్మాసనం రాత్రి 10 గంటల డెడ్‌లైన్ విధించినా అర్థరాత్రి వరకూ ప్రజల బాణసంచా కాలుస్తునే ఉన్నారు. శబ్ధకాలుష్యానికి తోడు వాయుకాలుష్యం బాధించింది. సుప్రీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ఒక్క ఢిల్లీనగరానికే పరిమిత కాలేదు. వాణిజ్య రాజధాని ముంబయి, కోల్‌కతా, జైపూర్ లాంటి మహానగరాల్లోనూ అర్థరాత్రి వరకూ దీపావళి మందులు కాల్చారు. బాణసంచా కాల్చడంతో ఆ పొగ గాలిలో కలిసిపోయి పరిస్థితి తీవ్రరూపం దాల్చిందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇన్‌డెక్స్(ఏక్యూఐ) ఏకంగా 574కు పెరిగిపోయింది. ఇది అత్యంత ప్రమాదకర పరిణామమేనని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘సఫర్’ పేర్కొంది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చి(ఎస్‌ఏఎఫ్‌ఏఆర్) ఈ డాటాను విడుదల చేసింది. దీపావళి రాత్రి ఏక్యూఐ మామూలుకంటే పది రెట్టు అధికంగా నమోదైందని వారన్నారు. ఏక్యూఐ 0-50 మధ్య ఉంటే మంచిదిగా గుర్తిస్తారు. అదే 51-100 మధ్య అయితే సంతృప్తికరం. 101- 200 అయితే ఓ మోస్తరు. 201-300 ఉంటే పూర్. అదే 301-400 అయితే వెరీ పూర్. 401- 500 మధ్య ఏక్యూఐ నమోదయితే తీవ్రమైనది పరిగణిస్తారు. 500 దాటిపోయింటే అత్యంత ప్రమాదకరమే. దీపావళి పుణ్యమాని బుధవారం రాత్రి ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. ఇది ఇలాగే బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం రాత్రి వరకూ కొనసాగితే తీవ్ర ప్రభావం చూపుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పీఎం 2.5కు మించిపోయిన ఏడురెట్లు రికార్డయినట్టు ఆయన చెప్పారు. వాయు కాలుష్యం వల్ల శ్వాసకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీపావళే కాదు పండుగల సందర్భంగార ఆత్రి 8-10 గంటల మధ్యలోనే బాణసంచా కాల్చాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎక్కువ కాంతివంతం కాని, తక్కువ శబ్దం అలాగే రసాయనాలు స్వల్పంగా వినియోగించి ‘గ్రీన్ క్రాకర్స్’ తయారు చేయలని బాణసంచా కంపెనీలను కోర్టు ఆదేశించింది. ప్రజలకు ఎలాంటి హానికరమైన మందులు అందుబాటులో ఉంచొద్దని బెంచ్ చెప్పినా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఆదేశాలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే అధికారం ఆయా పరిధిలోని స్టేషన్ పోలీసు అధికారికి ఉంటుందని బెంచ్ హెచ్చరించింది. అయితే అనేక చోట్ల కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారు. ఢిల్లీ నగరంలోని మయూర్ విహార్ ఎక్స్‌టెన్షన్, లజ్‌పత్ నగర్, లూట్‌యెన్స్, ఐపీ ఎక్స్‌టెన్షన్, ద్వారకా, నొయిడా సెక్టర్ 78లో అర్ధరాత్రి వరకూ మందులు కాలుస్తునే కనిపించారు. మరోపక్క సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు అధికారులు ఉపక్రమిస్తున్నారు. ఎక్కడెక్కడ ఇలా జరిగిందీ తెలుసుకోడానికి ప్రత్యేక పోలీసు పెట్రోలింగ్ నిరంతరాయంగా జరిపినట్టు అధికారులు వెల్లడించారు.
చిత్రాలు.. బాణసంచా మోత అనంతర దృశ్యాలు