జాతీయ వార్తలు

టికెట్లు ఎవరికివ్వాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: చాలా మంది సీనియర్ నేతలు తమతమ కొడుకులు, కూతుళ్లు లేదా బంధువులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి జటిలంగా మారిందని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్‌పీ నాయకుడు కే. జానారెడ్డితోపాటు, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు తదితర నాయకుల కూడా తమ భార్య లేదా పిల్లలు లేదా సోదరులు లేదా ఇతర బంధువులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నందున, ఎవరికి టికెట్లు ఇవ్వాలి? ఎవరిని పక్కకు పెట్టాలి అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరుముగ్గురికి టికెట్లు ఎలా ఇస్తారంటూ టికెట్లు ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్‌దాస్‌ను గురువారం నిలదీశారు. ఈ విధంగా చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోవటం ఖాయమంటూ ఒకరిద్దరు హెచ్చరించారు. దీనితో భక్తచరణ్‌దాస్ నాయకత్వంలోని రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ఈ అంశాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వదిలేసింది. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది నాయకులు తమ భార్యాపిల్లలు, బంధువులకు టికెట్లు డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెళ్లడించాయ. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఏర్పాటైన కేంద్ర ఎన్నికల కమిటీ వీరి టికెట్లపై తుది నిర్ణక్షం తీసుకుంటుంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల భార్యాపిల్లలు, ఇతర బంధువులకు టికెట్లు ఇచ్చే అంశంపై అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నదనేది శనివారం జాబితా ప్రకటించిన తరువాతనే వెల్లడవుతుంది. ఉత్తమ్ హుజురాబాద్, ఆయన భార్య పద్మావతి గత ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుండి విజయ సాధించడం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరికి కూడా టికెట్లు ఇస్తుస్తున్నారు. కాగా, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి తన కుమారుడు రఘువీర్ రెడ్డికి మిర్యాలగుడా టికెట్ అడుగుతున్నారు. జానారెడ్డి కోరుతున్నట్లు రఘువీర్ రెడ్డికి టికెట్ లభిస్తే తండ్రి, కొడుకులకు టికెట్లు ఇచ్చినట్లు అవుతుంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడికి రాజేంద్రనగర్ నియోజకవర్గం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. నల్గొండకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటరెడ్డి ఎమ్మెల్సీ అయిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఆశిస్తున్నారు. సీనియర్ నాయకురాలు డీకే అరుణ తన కూతురుకు టికెట్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే మాదిరి మరికొంత మంది సీనియర్ నేతలు కూడా తమ బంధువులకు టికెట్లు రావాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎవరెవరికి టికెట్లు లభిస్తాయి? ఎవరెవరికి మొండి చేయి చూపిస్తారనేది ఆసక్తి రేపుతున్నది.