జాతీయ వార్తలు

మీరే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన దయాశంకర్ సింగ్‌పై బిఎస్‌పి అధినేత్రి మాయావతి మరింతగా పట్టుబిగించారు. దయాశంకర్‌ను అన్ని పదవుల నుంచీ తొలగించినంత మాత్రాన సరిపోదని, ఆయనపై బిజెపి స్వయంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులపై దాడులు తీవ్రమయ్యాయని, గోరక్షణ పేరుతో ఇలాంటి కృత్యాలకు పాల్పడుతున్నారని గురువారం రాజ్యసభలో అన్నారు. ఈ అంశానికి పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం వెంటనే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గుజరాత్ ఘటనకు సంబంధించి సిఐడి దర్యాప్తుకు బదులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ జరిపించాలన్నారు. తనపై బిజెపి నేత చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తూ తనకు మద్దతు పలికిన పార్లమెంట్ సభ్యులకు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులకు మాయావతి కృతజ్ఞతలు తెలిపారు. దళితుల హక్కులకోసం మరింత స్ఫూర్తిదాయకంగా పోరాటం చేసేందుకు ఈ పరిణామం తనకు మరింత ఊతాన్నిచ్చిందన్నారు.