జాతీయ వార్తలు

రేపే ఇస్రో భారీ ఉపగ్రహ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 12: కమ్యూనికేషన్ రంగంలో నూతన పుంతలు తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ సమాచార ఉపగ్రహ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్ని శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుండి ఈ నెల 14న సాయంత్రం 5:08గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-డి2 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో డాక్టర్ సురేష్ అధ్యక్షతన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) జరిగింది. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశమై సుదీర్ఘంగా చర్చించినంతరం ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను 25:30గంటల ముందు అనగా మంగళవారం మధ్యాహ్నం 3:30గంటలకు ప్రారంభించనున్నారు. ఈ రాకెట్ ద్వారా సమాచార రంగానికి చెందిన 3600కిలోల బరువుగల జీశాట్-29 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇస్రో స్వదేశీ ఉపగ్రహాల్లో ఇంతభారీ ఉపగ్రహాన్ని పంపించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశ వ్యాప్తంగా కమ్యూనికేషన్ సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా ఆదివారం రిహార్సల్‌ను శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం ప్రీ కౌంట్‌డౌన్‌ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాకెట్‌లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగానికి సిద్ధం చేశారు. 25:30గంటల కౌంట్‌డౌన్ కొనసాగినంతరం రాకెట్ బుధవారం సాయంత్రం 5:08గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నింగిలోకి ఎగరనుంది. ఇస్రో తొలిసారిగా అత్యంత భారీ రాకెట్ ప్రయోగం చేపట్టడం ఇదే ప్రథమం. మంగళవారం షార్‌కు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ రానున్నారు. ఆయన షార్‌కు చేరుకొని ప్రయోగ వేదిక పై సిద్ధంగా ఉన్న మార్క్ 3 రాకెట్‌ను పరిశీలించి కౌంట్‌డౌన్ ప్రక్రీయ శాస్తవ్రేత్తలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగం పై చర్చించనున్నారు. భారీ శక్తివంతమైన రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో మార్క్ 3 రాకెట్‌ను రూపొందించారు. దాదాపు 18సంవత్సరాల పాటు శాస్తవ్రేత్తలు వివిధ పరీక్షలు నిర్వహించి భారీ రాకెట్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. భవిష్యత్‌లో షార్ కేంద్రం నుండి భారీ ప్రయోగాలతో పాటు మానవ సహిత ప్రయోగాలకు మార్క్ 3 రాకెట్‌ను తొలిసారిగా 2017లో జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-డీ 1 రాకెట్ ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. మళ్లీ మార్క్ 3-డీ2 ద్వారా జీశాట్-29 ఉపగ్రహ ప్రయోగం రెండోవది కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్‌లో మానవులను సైతం అంతరిక్షంలోకి పంపేందుకు మార్గం సుగమం అవ్వడమే కాకుండా కమ్యూనికేషన్ రంగంలో భారత్ మరో ముందడుగులోకి చేరుతోంది.