జాతీయ వార్తలు

నేనంటే నేను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏకి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలనుకున్న ప్రతిపక్షాల మహాకూటమిలో నాయకత్వ విభేదాలు నెలకొన్నట్లు తెలిసిందే. ఇందుమూలంగానే కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22న ఢిల్లీలో నిర్వహించాలనుకున్న మహాకూటమి నేతల భేటీ వాయిదా పడింది. నాయకత్వం విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి మధ్య నెలకొన్న విభేదాల మూలంగానే సమావేశం వాయిదా పడిందనే మాట వినిపిస్తోంది. కూటమికి ఎవరు నాయకత్వం వహించాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. మహాకూటమికి దిశ, దశ, నిర్దేశన తన నాయకత్వంలో జరగాలని మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నట్లు
తెలిసింది. అలా కానిపక్షంలో మహాకూటమిలో కొనసాగలేనని మమత తెగేసి చెబుతున్నట్లు కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగానే మహాకూటమి మొదటి భేటీ ఢిల్లీకి బదులు కోల్‌కత్తాలో జరగాలని ఆమె పట్టుపడుతున్నట్లు తెలిసింది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా మహాకూటమి నాయకత్వం కోసం పోటీ పడుతున్నారని అంటున్నారు. తమ పార్టీకి సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోతే కూటమిలో కూనసాగే ప్రసక్తే లేదని బీఎస్పీ సీనియర్ నాయకుడొకరు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఉత్తరాదిలో ఏం చేయగలుగుతారు? ఎంతమంది ఓటర్లను ప్రభావితం చేయగలుగుతారు? ఉత్తరాదిలో ఆయనకున్న స్టేక్స్ ఏమిటి అన్నది బీఎస్పీ నాయకుల వాదన. ఉత్తరాదికి చెందినవారు నాయకత్వం వహిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని వారు వాదిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వానికి మాత్రం చంద్రబాబు నాయుడు కన్వీనర్‌గా కొనసాగటం పట్ల ఎలాంటి అభ్యంతరం లేదని తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందేకు మమతా బెనర్జీ, మాయావతి ఇంతక్రితమే తిరస్కరించటం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో కాంగ్రెస్ విఫలమం కావటం తెలిసిందే. తమ స్థానంలో చంద్రబాబు ప్రతిపక్షాలను కూడగట్టటం మంచిదేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలను కూడగట్టే పని పూర్తి చేసిన తరువాత కాంగ్రెస్ ముందుకు వచ్చి నాయకత్వం చేపడితే తమ పరిస్థితి ఏమిటన్నది మమతా బెనర్జీ, మాయావతి ప్రశ్న. చంద్రబాబు పేరుతో కాంగ్రెస్ దొడ్డిదారిన ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేందుకు ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరాఠా నాయకుడు, ఎన్సీపీ అధినాయకుడు శరద్ పవార్ ఈ సమస్యలను పరిష్కరించలేకపోయారని చెబుతున్నారు. మహాకూటమికి ఎవరు నాయకత్వం వహించాలనే అంశంపై ఏకాభిప్రాయం కుదరనందుకే శరద్ పవార్ ఎన్‌డీఏకు ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేసే పనినుండి తప్పించుకుని చంద్రబాబును రంగంమీదకి తెచ్చారని బీఎస్పీకి చెందిన ఒక నాయకుడు చెప్పారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. ఈ నేపథ్యంలో మహాకూటమి జాతీయ సమావేశానికి హాజరు కాలేమని బీఎస్పీ నాయకులు అంటున్నారు. ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ముగిసిన తరువాతనే మహాకూటమి జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు చెబుతున్నారు.