జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు మోదీ ఫోబియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సింఘ్‌పూర్: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై బీజేపీ చీఫ్ అమిత్‌షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్‌కు మోదీ ఫోబియా’ పట్టుకుందని షా వ్యంగ్యోక్తులు విసిరారు. మధ్యప్రదేశ్‌లోని సోమవారం ఓ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ నెహ్రూ-గాంధీ కుటుంబం నాలుగు తరాలు దేశాన్ని పాలించినా అభివృద్ధి ఊసేలేదని ధ్వజమెత్తారు.‘ప్రతిపక్ష కాంగ్రెస్ మోదీ ఫోబియాతో బాధపడుతోంది. ఎంతసేపుప్రధాని పదవిని చేజిక్కించుకోవాలన్న తపనే తప్ప వారికి మరో ధ్యాసే లేదు’అని ఆయన విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 129 అభివృద్ధి పథకాలను ప్రారంభించి విజయవంతంగా అమలుచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.‘నాలుగు తరాలు అధికారం చెలాయించిన నెహ్రూ-గాంధీ కుటుంబం దేశానికి ఏం చేసింది?’అని బీజేపీ అధినేత నిలదీశారు. ఇటీవల ఓ ఎన్నికల సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాన్ని అమిత్‌షా ఎద్దేవా చేశారు. 22 నిమిషాల ప్రసంగంలో 44సార్లు మోదీ పేరును ప్రస్తావించారని ఆయన అన్నారు. ఇంతకీ రాహుల్ ఏ పార్టీ తరఫున ప్రచారం చేశారో తనకే ఆశ్చర్యం కలిగించిందని ఆయన తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు చేశారని అమిత్‌షా స్పష్టం చేశారు. 2106లో సరిహద్దులో సర్జికల్ దాడులు చేసి ఉగ్రమూకలకు దడ పుట్టించారని ఆయన అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆయన ఆరోపించారు. బీజేపీ వచ్చాక ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిందని ఆయన చెప్పారు.