జాతీయ వార్తలు

ఉద్రిక్తతల వెనక సంఘ్‌పరివార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, నవంబర్ 20: శబరిమలలో ఉద్రిక్తత, అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడానికి బీజేపీ, హిందూ సంస్థలే కారణమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతోమాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే శబరిమల అంశాన్ని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అయ్యప్ప ఆలయ ప్రవేశ అంశాన్ని పక్కదారిపట్టించేందుకు సంఘ్‌పరివార్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. శబరిమల అంశాన్ని రెచ్చగొట్టి తద్వారా ప్రయోజనం పొందాలని హిందూ సంస్థలు చూస్తున్నాయని, కరసేవకులను పంపి ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారని కేరళ సీఎం అన్నారు. ఓ కుట్రపూరితమైన అజెండాతో సంఘ్‌పరివార్ పనిచేస్తోందని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడం గర్హనీయమని ఆయన అన్నారు. ఆదివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో 69 మందిని పోలీసులు అరెస్టు చేయడాన్ని విజయన్ సమర్ధించుకున్నారు. అరెస్టయినవారు భక్తులు కాదని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలని ఎదురుదాడి చేశారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం పునరుద్ఘాటించారు. ఆర్‌ఎస్‌ఎస్, కాంగ్రెస్ రెండూ శబరిమల అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. కాగా శబరిమల విషయంలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేకపోయిందని, అందుకే సమస్య జఠిలంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. భక్తుల విశ్వాసాలను, మనోభావాలను వామపక్ష ప్రభుత్వం అణచివేస్తోందంటూ షా వరుస ట్వీట్లు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి విజయన్ తీవ్రంగానే స్పందించారు.‘శబరిమల పవిత్రను కాపాడుతాం. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితోపనిచేస్తోంది. హింసను ప్రేరేపించే శక్తులను ఉపేక్షించడ.. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోదు’అని కేరళ సీఎం ప్రకటించారు. భక్తుల విశ్వాసం పేరుతో సంఘ్‌పరివార్ ఉద్రిక్తలు రెచ్చగొడుతోందని, కొండను ‘కబ్జా’చేయడానికి ప్రయత్నిస్తోందని విజయన్ దుయ్యబట్టారు. అయ్యప్పను దర్శించుకునే భక్తులకు పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.