జాతీయ వార్తలు

విశ్వసనీయత కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థ, చట్టసభలను మనందరం కలిసి బలోపేతం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపు ఇచ్చారు. ఈ మూడు వ్యవస్థలు బలహీనపడటం ఎంతమాత్రం మంచిది కాదు.. వీటిపట్ల ప్రజలు విశ్వాసం కోల్పోకూడదని అన్నారు. న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్ జ్ఞాపకార్థం కాపిటల్ ఫౌండేషన్ నిర్వహించిన 104 జయంతి సభలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషికి జీవిత సాఫల్య అవార్డు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి విక్రమ్‌జీత్ సేన్‌కు కుల్‌దీప్‌సింగ్ అవార్డును బహూకరించారు. ప్రముఖ గాంధేయవాది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షుడు డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డికి జాతీయ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినప్పుడు రెండు రెక్కల మధ్య అధికారాల విషయంలో ఉండే సున్నితమైన సంతులనం పాడుకాకూడదన్నది తన అభిప్రాయమని అన్నారు. ఆచరణ, సంయమనం ఒకే నాణానికి ఉండే ముఖాల వంటివని ఉపరాష్ట్రపతి చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థ, చట్టసభల పాత్రను స్పష్టంగా నిర్వచించారని తెలిపారు. వీటిని పాటించటం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటి అవరోధాలు లేకుండా దశాబ్దాల నుండి ముందుకు సాగుతోందని అన్నారు. కీలకమైన ఈ మూడు వ్యవస్థల మధ్య ఎలాంటి ఘర్షణ తలెత్తకూడదు.. ప్రతి ఒక్కరు ఇతరుల అధికారాలు, పాత్ర, బాధ్యతలను సరస్పరం గౌరవించుకోవటం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో ఇలాంటి ఆరోగ్యకరమైన ధోరణే కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి ఇతర వ్యవస్థల మీద అవగాహన సన్నగిల్లటం, అనవసర జోక్యాలు దేశాభివృద్ధి, పురోగతి మీద ప్రతికూల ప్రభావం చూపించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. రాజ్యాంగ నిర్మాతల దృష్టిని వాస్తవిక మార్గంలో స్వాగతించాలి.. వారి దూరదృష్టి, ఉదారవాద నాయకత్వాన్ని గౌరవిస్తూ వాటిని పాటించవలసిన అవసరం మనందరిపై ఉన్నదని వెంకయ్య సూచించారు. భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా రూపొందించటంలో న్యాయ వ్యవస్థ కీలకపాత్ర పోషించాలి.. న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలి.. పారదర్శకం, సమన్వయం చేయవలసిన అవసరం ఉన్నదని అన్నారు. వనరుల కొరత మూలంగా న్యాయ వ్యవస్థ వేగం తగ్గిందని, ఈ సమస్యను త్వరితగతిన పారదర్శక ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ సహా పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.

చిత్రం..గాంధేయవాది గున్నా రాజేందర్‌రెడ్డికి మంగళవారం ఢిల్లీలో
క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డును ప్రదానం చేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు