జాతీయ వార్తలు

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్, నవంబర్ 20: ఒరిస్సాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 49 మంది గాయపడ్డారు. జగత్‌పూర్ సమీపంలోని ఓ వంతెనపై వెళుతున్న బస్సు మహానదిలో దొర్లి పడడంతో ఈ విషాద ఘటన జరిగింది. తాల్చేరు నుంచి కటక్ వస్తున్న ఈ బస్సు బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొని 30 అడుగుల పైనుంచి పడిపోయిందని పోలీసులు తెలిపారు. బస్సుకు ఒక గేదె అడ్డు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ అదుపు తప్పిందని, అదే ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు వెల్లడించారు. ఆ గేదెను రక్షించేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నం బస్సు అతని అదుపు తప్పటానికి దారితీసిందని, బస్సు రైలింగ్‌ను ఢీకొని 30 అడుగుల లోతులో పడిపోయిందని తెలిపారు. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను అందరినీ రక్షించామని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని వెల్లడించారు. మృతుల్లో 9 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.