జాతీయ వార్తలు

భారత్‌మాతాకీ జై అనొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆల్వార్ (రాజస్థాన్), డిసెంబర్ 4: యువతకు విద్య, ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఎన్డీఏ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయన ఇక్కడ జరిగిన బ్రహ్మాండమైన ర్యాలీలో మాట్లాడుతూ బీజేపీ సర్కార్ స్కాంల ప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. రైతులకు రుణాలు మాఫీచేయకుండా మోసం చేశారని ఆయన అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి ప్రజలను భ్రమలకు గురిచేసి ఓట్లు దండుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, స్కాంలకు పాల్పడుతున్నారని ఆయన మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. నిజంగా యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించి ఉంటే వారి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని ఉండేవారు కారన్నారు. రైతాంగ సంక్షేమ విధానాలను అటకెక్కించారని గిట్టుబాటు ధరలను కల్పించకుండా మోసం చేశారన్నారు. అల్వార్‌లో ముగ్గురు నిరుద్యోగ స్నేహితులు ఉద్యోగం లేక మానసిక ఆందోళనతో వేగంగా వెళుతున్న రైలు కిందపడి మరణించారన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభల్లో ఇచ్చి భారత్‌మాతాకీ జై అనే నినాదం కేవలం తన స్నేహితుడు రిలయన్స్ అంబానీకి ఉపయోగపడుతోందన్నారు. మోదీ తీసుకునే నిర్ణయాలన్నీ తన స్నేహితులైన పారిశ్రామకవేత్తలకు ఉపయోగపడుతున్నాయన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్ విషయంలో అవినీతికి పాల్పడి సరైన సమాధానం లేకుండా తిరుగుతున్నారన్నారు. మోదీ భారత్ మాతాకీ జై అనకుండా అనిల్ అంబానీకీ జై, నిరవ్‌మోదీకీ జై, లలిత్‌మోడీకీ జై అనే నినాదాలు చేయాలన్నారు. భారత్‌మాతా అంటే దేశంలోని రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు వస్తారన్నారు. కాని సెంటిమెంట్లతో ప్రజల జీవితాలతో ప్రధాని నరేంద్ర మోదీ ఆడుకుంటున్నారని విమర్శించారు. రాజస్థాన్‌లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదిరోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామన్నారు.

చిత్రం..బ్రహ్మాండమైన ర్యాలీలో మాట్లాడుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ