జాతీయ వార్తలు

కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సాహిత్య రంగంలో సమున్నత శిఖరాలు అధిరోదించిన ప్రముఖ కవి, సాహితీవేత్త, విద్యాదాత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. 2018 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగు భాషనుంచి ‘విమర్శిని’ పేరుతో ఇనాక్ రచించిన వ్యాస సంకలనానికి
ఈ పురస్కారం లభించినట్టు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఈ పురస్కారాల వివరాలను వెల్లడించారు. 24 భాషల్లో ఏడు కవితా సంపుటాలకు, ఆరు నవలలకు, ఆరు చిన్న కథా సంకలనాలకు, మూడు సాహిత్య విమర్శ గంథ్రాలకు, రెండు వ్యాస సంపుటాలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి. 2019 జనవరి 29న లక్ష రూపాయల చెక్కు, తామ్రపత్రం, శాలువతో అవార్డు గ్రహితలను సత్కరిస్తారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామంలో 1939 జూలై 1 జన్మించారు. ఆంధ్ర-రాయలసీమ జిల్లాల్లో తెలుగు ఆచార్యుడుగా పనిచేసిన ఆయన అనంతరం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. మరోవైపు తెలుగు సాహితీ ప్రక్రియలో తనదైన శైలికి వనె్నలద్దుతూ తన కలం బలం చాటుతూ వచ్చారు. 1988లో మునివాహనుడు కథాసంపుటికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. విద్యాదాతగా సాహిత్యంలో ఆయన చేసిన కృషికిగానూ 2014లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సామాజిక ఆవేదనే సాహత్య సంవేదనగా భిన్నప్రక్రియల్లో ఆయన సాహిత్య రచనలు కొనసాగించారు. ఇప్పటికి 75కుపైగా గంథాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.