జాతీయ వార్తలు

కారే.. హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు శుక్రవారం జరుగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌దే పైచేయి అవుతుందని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విజయం దిశగా సాగుతున్నట్టు కనపడుతోందని ఇండియా టుడేకు చెందిన పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్‌ఈ) తన తాజా సర్వే ద్వారా తేల్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని నాలుగు పార్టీలతో కూడిన మహాకూటమి సులభంగా విజయం సాధించే పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొంది. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కి మద్దతు పెరిగింది. పీఎస్‌ఈ నెల రోజుల క్రితం నిర్వహించిన సర్వేలో 44 శాతం మంది ఓటర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వగా, తాజా సర్వేలో అధికార పార్టీ మద్దతుదారుల సంఖ్య 48 శాతానికి పెరిగింది. అయితే, అదే సమయంలో సర్వేలో పాల్గొన్న వారిలో అధికార మార్పిడి కోరుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. నెల రోజుల నాటి సర్వేలో 34 శాతం మంది
అధికార మార్పిడి జరగాలని కోరుకోగా, ఇప్పుడు వారి సంఖ్య 38 శాతానికి పెరిగిందని పీఎస్‌ఈ వెల్లడించింది. గతంతో పోలిస్తే సర్వేలో పాల్గొన్న వారిలో మరింత ఎక్కువ మంది తరువాతి ప్రభుత్వం గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కేటగిరీలో గత సర్వేలో 22 శాతం మంది ‘ఎలాంటి అభిప్రాయం’ లేదని పేర్కొనగా, ఇప్పుడు వారి సంఖ్య 14 శాతానికి తగ్గింది.
కేసీఆర్ సెప్టెంబర్ ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం యుక్తితో కూడిన చర్య అనే భావన నెలకొంది. అయితే, ఆయన అంచనా వేసిన ప్రకారం పరిస్థితులు లేవు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య అనూహ్య పొత్తు పరిస్థితులను మార్చివేసింది. సీపీఐ, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) కూడా ఈ కూటమిలో చేరిపోయాయి. ఇలా నాలుగు పార్టీలతో కూడిన మహాకూటమి ఏర్పాటు వాటి ఎన్నికల ప్రచారానికి బాగా ఊతమిచ్చిందని సర్వే పేర్కొంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో చెప్పుకోదగిన స్థాయిలో టీడీపీ ఉనికి ఉంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే, 2019 లోక్‌సభ ఎన్నికలపై దాని ప్రభావం భారీగా ఉంటుంది.
తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించినందున రాష్ట్ర ఏర్పాటు ఘనత కేసీఆర్‌కే దక్కుతోంది. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడగా, తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. పీఎస్‌ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది తదుపరి ముఖ్యమంత్రి కేసీఆరే కావాలని కోరుకున్నారు. ఇది కేసీఆర్‌కు ఉన్న అత్యంత బలమయిన అంశం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో అనేక మంది ప్రజలు లబ్ధి పొందారు. టీఆర్‌ఎస్ ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్‌లోని మురికి వాడల్లో బలంగా ఉంది. హైదరాబాద్ పాతబస్తీలో గట్టి పట్టున్న ఏఐఎంఐఎం తెరాసకు మద్దతిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
మొత్తం 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న బీజేపీకి పట్టణ ప్రాంతాలలో పట్టు ఉంది. పీఎస్‌ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటరీ నియోజకవర్గాలలోని 6,877 మంది ఓటర్లను టెలిఫోన్‌లో ఇంటర్వ్యూ చేశారు.