జాతీయ వార్తలు

తీర్థయాత్ర యోజన స్కీం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతిష్టాకరమైన ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన అనే స్కీంను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ స్కీం కింద ప్రతి నియోజకవర్గం నుంచి 11 మంది వృద్ధులను ఎంపిక చేసి వారిని తీర్థయాత్రలకు పంపుతారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 60 సంవత్సరాలు నిండిన వారు ఈ యాత్రకు అర్హులు. భార్య, భర్తలను యాత్రకు ఎంపిక చేస్తారు. 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని అటెండెంట్‌గా తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. కాని వృద్ధుల వయస్సు 70 ఏళ్లు ఉండాలి. ఈ ఖర్చును ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, సీనియర్ సిటిజన్ల మనోభావాలను గౌరవించకపోతే ఆ దేశం బాగుపడదన్నారు.
ఈ స్కీంకు ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రంలోని పౌరులు సహకరించాలన్నారు. దరఖాస్తు చేసుకునే వారు ఓటరు ఐడీని, వైద్యుల ధృవీకరణ పత్రాన్ని జతపరచాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. మూడు రోజులు రెండు రాత్రులు ఈ యాత్ర ఉంటుంది. ఢిల్లీ-మథుర- బృందావన్-ఆగ్రా-్ఫతేపూర్ సిక్రీ-్ఢల్లీ, ఢిల్లీ-హరిద్వార్-రుషీకేశ్-నీల్‌కంఠ్-్ఢల్లీ, ఢిల్లీ- ఆజ్మీర్- పుష్కర్-్ఢల్లీ, ఢిల్లీ-అమృత్‌సర్-వాఘా సరిహద్దు- ఆనందపూర్ సాహిబ్-్ఢల్లీ, ఢిల్లీ-వైష్ణవదేవి- జమ్ము-్ఢల్లీ పర్యటనలుగా యాత్రను వర్గీకరించారు. ఆర్థికంగా బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏడాది 77 వేల మందికి ఈ అవకాశాన్ని కల్పిస్తారు. ఈ యాత్రపై రైల్వేశాఖతో ఎంఓయూ ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు.

చిత్రం..‘తీర్థయాత్ర’ పేరుతో ఉచిత పథకాన్ని న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో
ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు