జాతీయ వార్తలు

మళ్లీ ఆలయం.. సమతే దేవాలయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మళ్లీ అయో ధ్య వేడి రాజుకుంటోంది. బాబ్రి మసీదు విధ్వంసం జరిగిన 26ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా అనుకూల, ప్రతికూల వాదులు తమ గళాన్ని వినిపించారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి తీరుతామంటూ బీజేపీ నేతలు ఈ సందర్భంగా తమ స్వరాన్ని మరింత పెంచితే..దేశంలో లౌకిక వాదం, రాజ్యాంగ పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం మరింత పెరిగిందని వామపక్షాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. హిందుత్వ అంశాలపై బీజేపీని నిలదీసేందుకు హిందుత్వ అనుకూల సంకేతాలు అందిస్తున్న కాంగ్రెస్ మాత్రం ఈ అంశంపై ఆచితూచి
వ్యవహరించే ధోరణి అవలంబించడం గమనార్హం. తన యజ్జోపవీతాన్ని గౌరవిస్తూ, దత్తాత్రేయ బ్రాహ్మణ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ అయోధ్యలో ఆలయ నిర్మాణ ఉద్యమానికి మద్దతు పలుకాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నాయకురాలు, కేంద్ర మంత్రి ఉమాభారతి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలోనే రామాలయాన్ని నిర్మించే లక్ష్యంతో అన్ని వర్గాలనూ సమన్వయ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉమాభారతి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పరిస్థితిని విషతుల్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రత్యర్థి వర్గాల మధ్య కుదిరిన ఒప్పందానికే తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ద్వారానో లేదా సంబంధిత వర్గాల మధ్య పరస్పర అవగాహన ద్వారానో రామాలయాన్ని నిర్మించాలన్నదే తమ లక్ష్యమది ఆయన చెప్పారు. ఈ రెండు అవకాశాలూ చేజారిపోతే శాసన పరమైన అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. కాగా, దేశ లౌకిక స్వభావాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని గురువారం ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమం సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అయోధ్య స్థలం అంశంపై సుప్రీం కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని బహిరంగంగా చెప్పిన బీజేపీ ఇప్పుడు దీనిపై ఆర్డినెన్స్‌ను తేవడం గురించి మాట్లాడుతోందని ఏచూరి అన్నారు. గత నాలుగేళ్లుగా రామాలయ నిర్మాణ అంశంపై వౌనం వహించిన బీజేపీ రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దీన్ని లేవనెత్తుతోందని అన్నారు. కాగా, బాబ్రీ విధ్వంసం రోజును రాష్ట్రంలో సామరస్య దినోత్సవంగా జరుకుంటున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఏ అవయవం లోపించినా మానవ శరీరం ఎలా పరిపూర్ణం కాదో..అన్ని వర్గాలు, కులాలు, మతాల ప్రజలు లేకుండా భారత దేశం కూడా సంపూర్ణం కాదని ఆమె వ్యాఖ్యానించారు. దేశ ప్రాథమిక లౌకిక లక్షణాన్ని మార్చేయడమే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పి వాటి అనుబంధ సంస్థలు పని చేస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజ అన్నారు.