జాతీయ వార్తలు

బీజేపీకి గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 6: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యురాలు సావిత్రిబాయి పూలే గురువారం బీజేపీ నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం మాట్లాడుతూ పార్టీలో వేర్పాటువాద దోరణి ఉందని, అంతేకాకుండా ప్రజాధనాన్ని ఆలయాలు, విగ్రహాల నిర్మాణం కోసం ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని వ్యాఖ్యానించారు. దళితురాలైన సావిత్రిబాయి పూలే బహ్రైచ్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చాలా రోజులనుంచి బీజేపీ అధిష్టానంపై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వివాదాస్పదంగా మారిన ఆమె అంబేద్కర్ జయంతి రోజున పార్టీని వీడారు. రాజ్యాంగాన్ని స్ఫూర్తిదాయకంగానూ, సహేతుకంగానూ అమలు జరిగేందుకు కృషి చేస్తానని, లోక్‌సభ సభ్యురాలిగా మాత్రం కొనసాగుతానని ఆమె చెప్పారు. ‘దేశానికి కాపాలాదారునిగా వ్యవహరిస్తున్న వ్యక్తి నేతృత్వంలో దేశ వనరులన్నీ లూటీ అవుతున్నాయ’ని ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె ఆన్యాపదేశంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి పౌరుడికీ రూ.15 లక్షల లబ్ధిచేకూరుతుందన్న హామీ అమలుకాలేదు కానీ ప్రజాధనం మాత్రం ఆలయాలు, విగ్రహాల నిర్మాణానికి దుర్వినియోగం అవుతోందని సావిత్రిబాయి పూలే ధ్వజమెత్తారు. ప్రజాధనంతో దేశం విడిచి పారిపోతున్న వారిని పట్టించుకోకుండా, హిందూ- ము స్లిం, భారత-పాక్ వివాదాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు.

చిత్రం..బీజేపీ నుంచి రాజీనామా చేసి లేఖను చూపిస్తున్న ఆ పార్టీ ఎంపీ సావిత్రిబాయి పూలే