జాతీయ వార్తలు

కోర్టు తీర్పునకు బద్ధులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం నిర్వహించతలపెట్టిన రథయాత్ర వ్యవహారం గురువారం అనేక మలుపులు తిరిగింది. శాంతి భద్రతల దృష్ట్యా ఈ యాత్రను అనుమతించలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపధ్యంలో గురువారం బీజేపీ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు దీన్ని శుక్రవారానికి వాయిదావేసింది. దీనిపై స్పందించిన బీజేపీ నాయకత్వం కోర్టు తీర్పు వెలువడే వరకూ రథయాత్రను నిలిపివేస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, రేపుకూచ్‌బెహార్ రావడానికి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గియా తెలిపారు. కూచ్‌బెహర్ నుంచి అమిత్‌షా జరిపే యాత్ర వల్ల మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందున దానికి అనుమతి ఇవ్వడం లేదని అడ్వకేట్ జనరల్ కిషోర్‌దత్తా కలకత్తా హైకోర్టుకు ఇంతకు ముందు తెలియజేశారు. శుక్రవారం నుంచి అమిత్‌షా నిర్వహించనున్న పర్యటనకు కూచ్‌బెహర్ సూపరింటెండెంట్ సైతం అనుమతి నిరాకరించారని ఆయన కోర్టుకు వివరించారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ’ పేరుతో అమిత్ షా రాష్ట్రంలో మూడు రథయాత్రలు నిర్వహించనున్నారని, దీంతోమతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని, ఆ జిల్లాలో మతపరమైన ఘర్షణలు గతంలో జరిగిన చరిత్ర ఉందని, మతపరమైన అంశాలను రెచ్చగొట్టేవారు, రౌడీలు అక్కడ చురుకుగా ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ రథయాత్ర నిర్వహించడం భావ్యం కాదని అనుమతి నిరాకరిస్తూ ఎస్పీ నివేదిక ఇచ్చారని, అంతేకాకుండా ఈ రథయాత్రకు బీజేపీ నేతలు, ఇతర రాష్ట్రాల నుంచి అనేకమంది అభిమానులు వస్తారని, అది కూడా స్థానికంగా శాంతిభద్రతలపై ప్రభావం చూపుతుందని అన్నారు. స్థానిక పరిస్థితులను ఆధారం చేసుకుని పాలనాపరమైన అనుమతిని నిరాకరిస్తున్నట్టు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని సున్నితపరమైన అంశాలు ఉన్నందున అవి బాహాటంగా వెల్లడించలేకపోతున్నామని, దానిని సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పిస్తున్నామని ఏజీ తెలిపారు. దీంతో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న కోర్టు అమిత్ షా రథయాత్రకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు ప్రకటించింది.