జాతీయ వార్తలు

గ్రామాలకు గ్రామాలే ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, డిసెంబర్ 9: ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి లేమి తీవ్రంగా వెంటాడుతోంది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ముఖ్యంగా కొండ ప్రాంతాలలో ఉన్న పల్లె సీమల నుంచి ప్రజల వలస నిరాటంకంగా కొనసాగుతుండటం వల్ల అనేక గ్రామాలు నిర్మానుష్యం అవుతున్నాయి. గడచిన ఏడేళ్ల కాలంలో ఇలా ఏకంగా 734 గ్రామాలు మచ్చుకయినా మనిషి కానరాని దుస్థితికి చేరాయి. ఉత్తరాఖండ్‌లో సుమారు 16,500 గ్రామాలు ఉండగా, అందులో ముఖ్యంగా కొండ ప్రాంతాలలో ఉన్న 734 గ్రామాలు ప్రజలు ఎవరూ లేకుండా పూర్తిగా నిర్మానుష్యం అయ్యాయి. ఈ 734 గ్రామాలలో ఒక్క మనిషి కూడా జీవించడం లేదని ఉత్తరాఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ మైగ్రేషన్ కమిషన్ ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్ నేగి ఒక వార్తాసంస్థకు చెప్పారు. ప్రజలు వలస వెళ్లడంతో శిథిలమయిన వారి ఇళ్లు, కలుపు మొక్కలు, ఇతర చెట్లతో నిండిపోయిన వారి పంట క్షేత్రాలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా పౌరి జిల్లాలో ఈ దుస్థితి ఎక్కువగా కనపడుతోంది. ఈ జిల్లాలో మొత్తం 298 గ్రామాలు ఉండగా, అందులో 186 గ్రామాలు పూర్తిగా నిర్మానుష్యం అయ్యాయని నేగి వివరించారు. కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఒక నివేదికను ఉటంకిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో ప్రజల వలస కారణంగా అత్యంత అధ్వాన్నంగా తయారయిన జిల్లా పౌరి. దీని తరువాత స్థానాన్ని అల్మోరా ఆక్రమించింది. అల్మోరా జిల్లాలో కమిషన్ బృందం చేస్తున్న అధ్యయనం ఇంకా కొనసాగుతోంది. క్రితం జనాభా లెక్కలు జరిగిన 2011వ సంవత్సరం నుంచి గ్రామాల వారీగా గణాంకాలను సేకరిస్తున్నట్టు నేగి తెలిపారు. అభివృద్ధి లేని కొండ ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెళ్లడం సాధారణ సమస్యే అయినప్పటికీ, ఒక్క మనిషి కూడా లేకుండా గ్రామాలు ఖాళీ కావడం అనేది ఉత్తరాఖండ్‌కు మాత్రమే ప్రత్యేకమని నేగి వివరించారు.