జాతీయ వార్తలు

తొలుత హక్కుల తొలగింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితాలో పేర్లు లేని వారి హక్కులను తొలుత తొలగించే అవకాశం ఉందని అధికారులు ఆదివారం తెలిపారు. అస్సాం ప్రభుత్వం తయారు చేసిన ముసాయిదా ఎన్‌ఆర్‌సీ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఇచ్చిన గడువు ఈ వారంతో ముగియనుంది. అయితే, ఎన్‌ఆర్‌సీ ముసాయిదా జాబితాలో పేర్లు లేని 40 లక్షల మందికి గాను ఇప్పటివరకు కేవలం పది లక్షల మంది మాత్రమే తమ పేర్లను ఆ జాబితాలో చేర్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. తాము భారత పౌరులమని పేర్కొంటూ సంబంధిత పత్రాలను సమర్పించారు. భారత పౌరసత్వం ఉన్నట్టు ధ్రువీకరించే పత్రాలను సమర్పించని వారి హక్కులను తొలుత తొలగించే అవకాశం ఉందని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అయితే, ఎలాంటి పత్రాలు లేకుండా అస్సాంలో నివసిస్తున్న వారి భవితపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఎందుకంటే అస్సాం ప్రభుత్వం చేపట్టిన ఎన్‌ఆర్‌సీ జాబితా రూపొందించే ప్రక్రియను అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఎన్‌ఆర్‌సీ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి దరఖాస్తులు సమర్పించే ప్రక్రియ సెప్టెంబర్ 25వ తేదీన ప్రారంభమయింది. డిసెంబర్ 15వ తేదీతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఎన్‌ఆర్‌సీ ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారికి తమకు భారత పౌరసత్వం ఉందని నిరూపించుకోవడానికి చాలా సమయం ఇవ్వడం జరిగిందని మరో అధికారి అన్నారు. కొంతమంది ఎన్‌ఆర్‌సీ జాబితాలో తమ పేర్లను చేర్చాలని కోరడం లేదని, అంటే వారివద్ద అవసరమయిన పత్రాలు లేవని ఆయన పేర్కొన్నారు. విస్తృత స్థాయిలో యంత్రాంగాన్ని ఉపయోగించి, ఎంతో ప్రయాసతో ఎన్‌ఆర్‌సీ జాబితాను రూపొందించడం జరిగిందని, అందువల్ల ఆ జాబితాలో పొరపాట్లు దొర్లడానికి చాలా తక్కువ అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లు లేనివారందరికీ ఆ జాబితాను రూపొందించిన ఎన్‌ఆర్‌సీ అధికారుల నిర్ణయాన్ని సిటిజెన్‌షిప్ ట్రిబ్యునళ్లు, కోర్టుల్లో సవాలు చేసే హక్కు ఉంది.