జాతీయ వార్తలు

కర్తాపూర్ కారిడార్ వెనక పాక్ ఆర్మీ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగర్, డిసెంబర్ 9: భారత్ సరిహద్దు నుంచి పాక్‌లోని కర్తాపూర్ కారిడార్ నిర్మాణం ప్రతిపాదనను ముందుగా పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించడం వెనక కుట్ర దాగి ఉందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. ఈ విషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాల్సి ఉందన్నారు. కాని కారిడార్ అంశాన్ని పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వా మంత్రి నవజోత్ సిదూకు సమాచారం అందించారన్నారు. ఇదంతా ఐఎస్‌ఐ గేమ్ ప్లాన్ అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద కుట్రను పాక్ ఆర్మీ ఆవిష్కరించినట్లు అర్థమవుతుందన్నారు. పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరించేందుకు పాక్ దురాలోచనతో ఉందన్నారు. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సిదూ వ్యవహారాన్ని అనవసరంగా గోరంతలు కొండంతలు చేసి చూపించారన్నారు. ఈ విషయమై ఆకాలీలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. సిదూతో తన సంబంధాల విషయమై ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారని ఆయన బీజేపీ, అకాలీలను విమర్శించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా మారిందని, పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరించాలని చూస్తున్నారని, ఈ విషయాన్న దాచిపెట్టి కారిడార్‌పై మాట్లాడుతున్నారని పాకిస్తాన్‌పై ఆయన ధ్వజమెత్తారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి కర్తాపూర్ కారిడార్‌ను తెరవాలనే డిమాండ్ ఉందన్నారు. విభజన వల్ల సిక్కులకు చెందిన పవిత్ర ప్రదేశాలు శ్రీనానక్ సాహిబ్, శ్రీ పంజా సాహిబ్, డేరా సాహిబ్, కర్తాపూర్ సాహిబ్ పుణ్యక్షేత్రాలు పాక్‌కు వెళ్లాయన్నారు. ఈ అంశాన్ని గతంలో ప్రధానులుగా పనిచేసిన ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్‌లు పాకిస్తాన్‌తో ప్రస్తావించారన్నారు. తాను గతంలో పంజాబ్ ముఖ్యమంత్రి పర్వీజ్ ఎలాహితో , అధ్యక్షుడు ముషార్రఫ్‌తో కూడా కారిడార్‌పై మాట్లాడానన్నారు.