జాతీయ వార్తలు

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: తరాలు మారుతున్నా మాదిగల తలరాతలు మాత్రం మారడం లేదని మాదిగ రిటైర్డ్ ఉద్యోగుల విభాగం నాయకుడు బి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్పార్పీఎస్ చేప్పట్టిన నిరసన కార్యక్రమాలు శనివారం నాటికి ఐదోరోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలు చివరి రోజు ఆగస్టు 12 వరకు జరుగుతాయి. శనివారం మాదిగ రిటైర్డ్ ఉద్యోగుల విభాగం దీక్షలో పాల్గొంది. రిటైర్డ్ ఉద్యోగుల నేత బి నారాయణ మాట్లాడుతూ రిజర్వేషన్లున్నా, ఫలాలు అనుభవించే విషయంలో మాదిగలు అన్యాయానికి గురయ్యారని తెలిపారు.
న్యాయశాఖ మంత్రితో మందకృష్ణ చర్చలు
కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చాంద్ గెహ్లాట్ తో మందకృష్ణ మాదిగ శనివారం ఇక్కడ చర్చించారు. ఉదయం మంత్రి నివాసంలో గెహ్లాట్‌ను కలిసిన ఆయన ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను వివరించారు.