జాతీయ వార్తలు

ప్రత్యేక హోదా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. మంగళవారం నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన పార్లమెంట్ లైబ్రరీలో
అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ నుంచి విజయ సాయిరెడ్డి హైజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న ఈ శీతాకాల సమావేశాల్లోన్నైన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని.. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరినట్టు చెప్పారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన 11 ప్రధాన అంశాలను సమావేశంలో లేవనెత్తినట్టు చెప్పారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో ఉన్న విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ-చెన్నై కారిడార్, 11 కరవు జిల్లాలకు ప్రత్యేక సాయం తదితర అంశాలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యయత్నం ఘటనపై విచారణకు కేంద్రం ఎందుకు రాష్ట్రానికి వదిలేసిందని, కేంద్ర సంస్థలతో ఎందుకు దర్యాప్తు చేయించడం లేదని ప్రశ్నించినట్టు చెప్పారు. గుజరాత్-పాక్ సరిహద్దుల్లో చేపల వేటకు వెళ్లి పాక్ జల్లాలోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ అధికారులు ఏపీకి చెందిన 22మంది జాలర్లను అరెస్టు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని వారిని విడిపించాలని, తిత్లీ బాధితులకు పునరావాసం కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
చిత్రం..ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ,
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (మధ్యలో), విపక్ష నేత గులాం నబీ ఆజాద్