జాతీయ వార్తలు

అగ్ని-5 పరీక్ష విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలసోర్: దాదాపు ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే శక్తి కలిగిన అగ్ని-5 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిసా తీరంలోని అబ్దుల్‌కలామ్ దీవి నుంచి అణుసామర్థ్యం గల ఈ క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించారు. పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అగ్ని క్షిపణిని పరీక్షించడం ఇది ఏడోసారి. 17 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు గల ఈ క్షిపణి ఉపరితల లక్ష్యాలను సునాయసంగా ఛేదించగలుగుతుందని రక్షణ వర్గాలు తెలిపాయి. మొబైల్ లాంచర్ సహాయంతో ఈ క్షిపణిని పరీక్షించారు. అగ్ని-1 లక్ష్య సామర్థ్యం 800 కిలోమీటర్లు. అగ్ని-2 రేంజ్ రెండు వేల కిలోమీటర్లు, 3,4 క్షిపణులు లక్ష్యం 2,500 నుంచి 3000 కిలోమీటర్లు. తాజాగా ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని సాధించగలిగే సామర్థ్యంతో అగ్ని-5 క్షిపణిని అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి.