జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లో విజయోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని జాతీయ నాయకుడిగా నిలబెట్టాయి. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో అధికారంలోకి వచ్చే పరిస్థితులు నెలకొనటంతోపాటు మధ్యప్రదేశ్‌లో బీజేపీతో నువ్వా-నేనా అనే విధంగా ఫలితాలు ఉండటం పట్ల కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించారు.. వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ
ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీఏ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోకూడదని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ మాదిరిగా మధ్యప్రదేశ్‌లో కూడా తమకు స్పష్టమైన మెజారిటీ లభించి ఉంటే కాంగ్రెస్ మరోసారి జాతీయ పార్టీగా నిలదొక్కుకోవటంతోపాటు బీజేపీయేతర పార్టీల నాయకత్వాన్ని నిలబెట్టుకునేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. రాజస్థాన్‌లో అధికారంలోకి వస్తామని మాకు ముందునుంచే తెలుసు.. అయితే చత్తీస్‌గఢ్‌లో భారీ మెజారిటీ లభించటం తమను ఆశ్చర్యపరుస్తోందని వారంటున్నారు. చత్తీస్‌గడ్‌ఢ్ ప్రజాభిప్రాయం ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతోందనేది పోలింగ్‌కు రెండు మూడు రోజులు ముందు మాత్రమే తెలిసిందని.. ఈ విషయాన్ని తాము ముందే పసిగట్టగలిగి ఉంటే మరిన్ని సీట్లు అధికంగా వచ్చేవని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మిజోరంలో పార్టీ సోదిలో లేకుండా పోవటం కాంగ్రెస్ నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణలో అధికారంలోకి వస్తామనుకుంటే ఘోరపరాజయం ఎదురుకావటం కూడా కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్లే తెలంగాణలో ఊహకందని విధంగా కాంగ్రెస్ కొట్టుకుపోయిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పొత్తుపెట్టుకోవటాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొదటి నుండి వ్యతిరేకించినా రాహుల్ గాంధీ, మరికొందరి పట్టుదల మూలంగా పొత్తుపెట్టుకోక తప్పలేదు.. ఇప్పుడు దీనికి ఓటమి రూపంలో ప్రతిఫలం చెల్లించామని సీనియర్ నాయకుడొకరు తెలిపారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో సాధించిన విజయం, మధ్యప్రదేశ్‌లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వటం అనేది వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమకు బాగా కలిసి వస్తుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమలు చేసిన ప్రచార వ్యూహం బాగా కలిసివచ్చింది.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ వ్యూహం మంచి ఫలితాలను ఇస్తుందనే ధీమాను కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయానికి జాతీయ స్థాయిలో కర్నాటక లాంటి ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేయగలిగితే అధికారం తమదేనని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
చిత్రం..ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తల సంబరాలు