జాతీయ వార్తలు

చెయ్య తిరిగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కమలం పురిటిగడ్డ హిందీబెల్ట్‌లో ఓటర్లు బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. వరుస పరాజయాలతో నీరసపడిన కాంగ్రెస్ పార్టీ హిందీబెల్ట్‌లోని రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో విజయఢంకా మోగించగా, మధ్యప్రదేశ్‌లో బొటాబొటీ మెజారిటీ సాధించింది. దక్షిణ భారతదేశానికి ముఖద్వారమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మిజోరంలోనూ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. మిజోరం కాంగ్రెస్ చేజారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత మాదేనని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టీడీపీతో జతకట్టి చతికిలపడింది. ఐదు రాష్ట్రాల ఫలితాల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఒక్కటే ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటుకుంది. టీఆర్‌ఎస్‌కు 119 స్థానాల్లో 88 సీట్లు లభించగా, కాంగ్రెస్ టీడీపీ కూటమికి 21 సీట్లు, బీజేపీకి ఒకటి, మజ్లిస్‌కు ఏడు, ఇతరులకు రెండు సీట్లు లభించాయి.
చత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ మంగళవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. ‘మేము ప్రతిపక్ష పార్టీగా ఉండాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. హుందాగా స్వీకరిస్తున్నాం. ప్రజల తీర్పును గౌరవిస్తాం. మా తప్పులపై ఆత్మావలోకనం చేసుకుంటాం’ అని రమణ్‌సింగ్ అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 67 సీట్లు, బీజేపీకి 18 సీట్లు, అజిత్‌జోగి అలయెన్స్‌కు 8 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో కడపటి వార్తలు అందేవరకు బొటాబొటీకి మెజార్టీ చేరువలో కాంగ్రెస్ ఉంది. 230 సీట్లలో కాంగ్రెస్‌కు 113, బీజేపీకి 110, బీఎస్పీ, ఎస్‌పీ, ఇతరులకు కలిపి 7 సీట్లలో ఆధిక్యత లభించింది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌కు మరికొన్ని సీట్లు కావాలి. ఇక్కడ బీజేపీకి, కాంగ్రెస్‌కు చెరిసమానంగా 41.4 శాతం
ఓట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్ని సీటు నుంచి నెగ్గారు. కాగా ఆయన మంత్రివర్గంలో ఉన్న 12 మంది మంత్రులు వెనకపడ్డారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం పదవి రేసులో ఉన్న జ్యోతిర్యాధిత్య సింధియా చెప్పారు.
రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 73 సీట్లు, ఇతరులకు 27 సీట్లు వచ్చాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సచిన్ పైలెట్ చెప్పారు. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రతిపక్ష పార్టీకి అధికారాన్ని అప్పగించడం అనవాయితీగా వస్తోంది. గత 20 ఏళ్లుగా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడిస్తున్నారు. మిజోరంలో 40 అసెంబ్లీ సీట్లలో మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇక్కడ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఇక్కడ తొలిసారి పోటీచేసిన బీజేపీకి ఒక స్థానం లభించడం విశేషం.