జాతీయ వార్తలు

పవర్ ఎంఎన్‌ఎఫ్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజ్వాల్, డిసెంబర్ 11: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర పునరావృతమైంది. పదేళ్ల విరామం తరువాత మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఫలితాలు ఉండగా, ఈశాన్య రాష్ట్రంలో అధికారంలోఉన్న ఏకైక రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. ముఖ్యమంత్రి లాల్ తన్‌హావాలా రెండు చోట్ల పోటీ చేసి భంగపడ్డారు. సెర్ఛిప్, ఛాంఫయి నియోజకవర్గాల నుంచి ఓటమి చెందారు. సెర్ఛిప్‌లో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ చేతిలో పరాజయం చెందారు. సీఎం అభ్యర్థి లాల్‌దొహుమా చేతిలో 410 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఛాంఫయిలో ఎంఎన్‌ఎఫ్ అభ్యర్థి లాల్‌నంత్లూంగ చేతిలో 1049 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. 23 స్థానాల్లో ఎంఎన్‌ఎఫ్ అభ్యర్థులు విజయం సాధించారు.2013 ఎన్నికల్లో 34 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. 2008 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన ఎంఎన్‌ఎఫ్ తిరిగి అధికారంలోకి వచ్చింది. జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ ఐదు చోట్ల గెలిచింది. క్రైస్తవుల ప్రభావం ఎక్కువగా ఉండే మిజోరంలో బీజేపీ ఖాతా తెరిచింది. మాజీ మంత్రి బుద్ధా ధాన్ ఛక్మా దక్షిణ మిజోరంలోని లాంగ్‌త్లయ్ నుంచి విజయం సాధించారు.
లెజిస్టేచర్ పార్టీ నేతగా జోరంతంగ
ఎంఎన్‌ఎఫ్ లెజస్లేచర్ పార్టీనేతగా జోరంతంగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మంగళవారం ఇక్కడ ఎంఎన్‌ఎఫ్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. త్వాన్‌లుయా డిప్యూటీ నేతగా, లాల్‌రువత్‌కిమా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాగా ఎన్నికలో ఓటమిపాలైన ముఖ్యమంత్రి లాల్ తన్‌హావాలా గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించారు.
*
మిజోరం
*
మొత్తం సీట్లు - 40
కాంగ్రెస్ - 5
ఎంఎన్‌ఎఫ్ - 26
బీజేపీ - 1
ఇతరులు - 8