జాతీయ వార్తలు

పార్లమెంట్ అవరణలో ఏపీ ఎంపీల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు పార్లమెంట్ అవరణలో బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ముఖద్వారం వద్ద తెలుగుదేశం ఎంపీలు అశో క్ గజపతిరాజు, మురళీమోహన్, శివప్రసాద్, అవంతి శ్రీనివాస్, రామ్మోహన్ నాయు డు, శివప్రసాద్, కొనకళ్ల నారాయణ, గల్లా జయదేవ్, టీజీ వెంకటేశ్, కనకమేడల రవీంద్రకుమార్, బుట్టా రేణుక ఈ ఆందోళనలో పా ల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ప్లకార్డులు చేతబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు ధర్నా చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మిధున్‌రెడ్డి, ఎన్ శివప్రసాద్, వల్లభనేని బాలశౌరి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రాలు.. పార్లమెంట్ వద్ద నిరసన తెలుపుతున్న తెలుగుదేశం ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు