జాతీయ వార్తలు

విమానం ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 23: బంగాళా ఖాతం మీదుగా ఎగురుతూండగా శుక్రవారం 29మందితో అదృశ్యమైన ఎఎన్ 32 వైమానిక దళ రవాణా విమానం ఆచూకీ ఇంకా తెలియలేదు. బయలు దేరిన కొద్ది నిముషాలకే రాడార్ నుంచి తప్పిపోయిన ఈ విమానం కోసం నలుదిశలా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి పొద్దుపోయే వరకూ విమానం ఏమైంది.. కూలిపోయిందా అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరోపక్క వాతావరణం ప్రతికూలంగా ఉండటం గాలింపుచర్యలకు తీవ్ర అవరోధంగా మారింది. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న రక్షణ మంత్రి పారికర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఏరియల్ సర్వే జరిపారు. గాలింపు చర్యల్లో భాగంగా ఓ జలాంతర్గామి, 18 నౌకాదళ, తీరప్రాంత నౌకలు, పి-18, సి-30సహా ఎనిమిది విమానాలు, డార్నియర్‌లను రంగంలోకి దింపారు. ఇవన్నీ ఏకకాలంలో భిన్న దిశల్లో గాలింపు జరిపినా గల్లంతైన ఎఎన్-32విమానం జాడే తెలియలేదు. చెన్నైలోని తాంబారం నుంచి 1400కిలోమీటర్ల దూరంలోని పోర్టుబ్లెయిర్‌కు వెళుతూండగా మార్గం మధ్యలో ఈ విమానం గల్లంతైంది. శుక్రవారం ఉదయం 8గం 46నిముషాలకు తంబారం నుంచి బయలు దేరిన 16నిముషాల తర్వాత చివరి సారిగా ఈ విమానం నుంచి సంకేతాలు అందాయి. శుక్రవారం ఉదయం నుంచి గంటల తరబడి గాలింపు చర్యలు జరుగుతున్నా విమానం ఏమైందన్న దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి సంకేతాలు అందకపోవడంతో అధికారుల్లో ఆందోళన తీవ్రమైంది. అవసరమైతే మరింత విస్తృత స్థాయిలో అనే్వషణ ఆపరేషన్లను చేపట్టాలని అధికారుల్ని రక్షణ మంత్రి ఆదేశించారు. గత 24గంటలుగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ తాము జరిపిన అనే్వషణా ప్రయత్నాలను అధికారులు పారికర్‌కు వివరించారు. సముద్రం అలజడుల మయంగా ఉన్నా, దట్టమైన మబ్బులు కమ్ముకున్నా గాలింపు ప్రయత్నాల్లో ఎలాంటి రాజీలేకుండా ముందుకు వెళుతున్నామని తెలిపారు. మరో పక్క విమానంలో ఉన్న వారి కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి వారికి అవసరమైన సమాచారాన్ని అందించాలని పారికర్ ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.

చిత్రాలు.. ఆచూకీ లేకుండాపోయన ఎఎన్ 32 వైమానిక దళ రవాణా విమానం (ఫైల్ ఫొటో)
శనివారం గాలింపు చర్యల్లో పాల్గొని తాంబరం ఎయర్ ఫోర్స్ స్టేషన్‌లో దిగుతున్న ఓ విమానం