జాతీయ వార్తలు

‘జీరో’తో ఊహించని ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 12: బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. సినిమా సినిమాకీ నటనలో మెళకువలు నేర్చుకుంటూ కెరీర్‌ని మలుచుకోవడంలో ఆమెను మించినవారు లేరు. ఇన్నాళ్ల తన కెరీర్‌లో నటులందరితోనూ జతకట్టింది. వారితో సమానంగా ఆడిపాడి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. చేసిన చిత్రాలు.. పోషించిన పాత్రలు వేటికవే సాటిగా నిలిచి ఆమె క్రేజ్‌ని పెంచాయి. మైనే ప్యార్ క్వోం కియా, నమస్తే లండన్‌తో పాటు సింగ్ ఈజ్ కింగ్ తదితర చిత్రాలు ఆమెకు ఎనలేని పేరుని తెచ్చిపెట్టాయి. రెండు వేల మధ్య కాలంలో వచ్చిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టుకున్నాయి. బాలీవుడ్ కథానాయికలలో అగ్రనటిగా వెలుగులు విరజిమ్ముతున్న ఈ అందాలతార తన కెరీర్ గురించి వివరిస్తూ- ‘నేను చాలా అదృష్టవంతురాలిని. ఎన్నో ఉత్తమమైన చిత్రాలు.. మరెన్నో వైవిధ్యమైన పాత్రలు లభించాయి. ఆయా పాత్రలు నాకు ఎంతగానో పేరుని తెచ్చిపెట్టి కెరీర్‌లో ముందుకు సాగేలా చేశాయి. నా కెరీర్‌లో ఎందరో స్టార్‌లతో నటించే అవకాశం లభించింది. ‘జీరో’లాంటి సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఇది ఓ ప్రయోగమే. ఆనంద్ సార్, షారుఖ్‌ఖాన్, అనుష్కాశర్మలతో కలిసి నటించడం వాహ్.. గొప్ప అనుభూతే’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లభిస్తున్న అవకాశాలతో కత్రినా ఎంతో సంతోషంగా వుంది. తనకు మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న పరిశ్రమను ఎన్నటికీ మరచిపోలేనంటోంది. కెరీర్‌లో ముందుకెళ్లడానికి తను పోషిస్తున్న పాత్రలు రహదారిని చూపిస్తున్నాయనీ, అందుకు నిజంగా పరిశ్రమకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు వివరించింది. తను నటించే చిత్రం ద్వారా ఎప్పుడూ కొత్తదనానే్న కోరుకుంటాననీ, తన పాత్రల ద్వారా, నటించే చిత్రాల ద్వారా కొత్తదనం ప్రేక్షకులకు కొత్తదనం అందించాలన్నదే తన కర్తవ్యమని చెప్పింది. షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ నటించిన ఇసాక్బాజీ.. పాట ఓ ప్రయోగమేననీ, ఈ పాట సల్మాన్ తప్ప మరెవ్వరూ చేయలేరంటోంది. సల్మాన్‌తో స్టెప్పులేయడం చాలా ఆనందంగా వుంది. ఇది ఓ అందమైన పాటగానే నా మనసును పరవశింపజేసిందని చెప్పుకొచ్చింది. సహనటి దీపికా-రణ్‌వీర్‌ల వెడ్డింగ్ గురించి కత్రినాను కదిలిస్తే..నన్ను పెళ్లికి ఆహ్వానించారు. ఎంతో ఆనందంగా వెళ్లి ఆ వాతావరణాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఉదయం వేళ వరకు నృత్యం చేస్తూ గడిపాను. ఎన్నో చాక్లెట్లు తిన్నాను. నిజంగా అది ఒక అద్భుతమైన సమయం అంటూ పేర్కొంది. కత్రినాకైఫ్ నటించిన తాజా చిత్రం ‘జీరో’ ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్రం.. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్