జాతీయ వార్తలు

మోదీ మేజిక్‌కు కాలం చెల్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 12: మూడు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మోదీ మేజిక్ పనిచేయలేదని అర్థం అవుతుందని, ఆయన మేజిక్‌కు కాలం చెల్లిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా విమర్శించారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మోదీని తిరిగి ఎన్నుకోవడం కన్నా వచ్చే 2019 ఎన్నికల్లో విపక్షాలకు అధికారం అప్పజెప్పడమే మంచిదన్న భావనలో ప్రజలు ఉన్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన బీజేపీ, తెలంగాణ, మిజోరాంలలో ఒక్క సీటుతో సరిపెట్టుకుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి ఆయన విపక్షాలకు రెండు సూచనలు చేశారు. ఎన్నికలకు ముందే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సహా, విపక్షాలన్నీ ఏకమై బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని అన్నారు. అలా సాధ్యం కానప్పుడు స్థానికంగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల వారు తమ తమ పరిస్థితులకు వీలుగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రాంతీయ పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కలిసి ఉంటే బీజేపీకన్నా ఎక్కువ సీట్లను సాధించవచ్చునని ఆయన చెప్పారు. ప్రాంతీయ పార్టీల వారు కాంగ్రెస్‌తో సర్దుబాట్లు చేసుకుంటే విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చర్చలు జరుపుకుని ప్రధానిని ఎన్నుకోవచ్చునని చెప్పారు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసే విపక్షాల కూటమికి తానే నాయకత్వం వహిస్తానన్న ప్రకటించే తప్పు ఆ పార్టీ చేయకూడదని ఆయన సూచించారు. మోదీ మేజిక్‌తో తాము గెలుస్తామన్న బీజేపీ సిద్ధాంతాన్ని ఈ ఎన్నికలు పటాపంచలు చేశాయని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీజేపీ కనుక 150 సీట్లను గెల్చుకుంటే ఏకైక పెద్ద పార్టీగా తమకే అధికారం ఇవ్వాలని కోరే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితి రాకుండా విపక్షాలు మరిన్ని సీట్లను గెల్చుకోవాలని యశ్వంత్ సిన్హా సూచించారు.