జాతీయ వార్తలు

నేనంటే నేనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించిన కాంగ్రెస్ పార్టీ సీఎంల ఎంపిక బాధ్యతను ఎఐసీసీకి అప్పగించింది.
కాంగ్రెస్ పార్టీలో యువనేతలు, సీనియర్లకు మధ్య సీఎం పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, జ్యోతిరాధిత్య సింధియా, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌లు సీఎం పదవి కోసం పోటీపడుతున్నారు. యువనేత లేదా సీనియర్ నేతల్లో ఎవరిని ఎన్నిక చేసుకోవాలో తెలియక ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సందిగ్ధంలో పడ్డారు. కాగా గురువారం అర్థరాత్రిలోపల ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియాగాంధీ ఇప్పటికే పలుపర్యాయాలు రాహుల్ గాంధీతో సీఎం అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు యుద్ధవీరులు ఎంతో సంయమనంతో ఉన్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అభ్యర్థుల ఎంపికలో చివరకు ప్రియాంక గాంధీ కూడా జోక్యం చేసుకున్నారు. ఆమె కూడా రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి చర్చించారు. ఈ నెల 11వ తేదీన ఫలితాలు వెలువడగా, ఇంకా సీఎం పదవికి ఎవరిపేరును సిఫార్సు చేయాలో తెలియక కాంగ్రెస్ పార్టీ ఊగిసలాట ధోరణిని అనుసరిస్తోందని, ఇది పార్టీకి మంచిది కాదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. రాజస్థాన్‌లో సీఎం పదవి తమ నాయకుడికే కావాలని పైలెట్, గెహ్లాట్ వర్గాలు పార్టీ హైకమాండ్‌పై వత్తిడి తెస్తున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఇప్పటికే హైకమాండ్‌కు తెలియచేశామని, నివేదిక ఇచ్చామని ఎఐసీసీ ప్రతినిధి అవినాష్ పాండే చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త సీఎంను మీరే నియమించండి అంటూ ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపిన విషయం విదితమే. చత్తీస్‌గఢ్‌లో కూడా సీఎం పదవి కోసం పోటీ ప్రారంభమైంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భూపేష్ బాగల్, టీఎస్ సింగ్ దేవ్, ఓబీసీ నేత సాహూ, పార్టీ నేత చరణ్ దాస్ మహంత్ సీఎం పదవిని ఆశిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలసేకరణకు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను రాయ్‌పూర్‌కు పంపారు. పార్టీ సీనియర్లు కేసీ వేణుగోపాల్, ఏకే ఆంటోనీతో రాహుల్ గాంధీ ఉదయం నుంచి పలు దఫాలు చర్చించినా కొలిక్కి రాలేకపోయారు. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంత మంది మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సీనియర్లకు సీఎం పదవిని అప్పగించాలని, మరి కొంత మంది యువనేతలకు పగ్గాలు ఇవ్వాలని ఎఐసీసీపై వత్తిడి తెస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఉపముఖ్యమంత్రి పదవి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. హిందీబెల్ట్‌లోని మూడు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ విజయం సాధించింది.
చిత్రం.. జ్యోతిరాదిత్య సింథియా, కమల్‌నాథ్‌లతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్