జాతీయ వార్తలు

9.59 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఏపీ కట్టింది లక్ష ఇళ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ప్రధాన మంత్రి ఆవాస్ యోజ న(పట్టణ) పథకం కింద 2015 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 9లక్షల 59వేల 847 ఇళ్లు కేటాయించి రూ.14,414 కోట్లు సాయం కింద విడుదల చేయడానికి ఆమోదం తెలిపినట్టు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. అయితే కేటాయించిన ఇళ్లలో ఇప్పటి వరకు కేవలం 1 లక్షా 9 వేల 969 ఇళ్లు మాత్రమే పూర్తయినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జావాబిచ్చారు. పీఎంఏవై కింద కేంద్ర ప్రభుత్వం రూ.3,627 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలు సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతులను వెనక్కి తీసుకున్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని కేంద్ర సంస్థల్లో సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే రాష్ట్ర ఏజెన్సీలు దర్యాప్తు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి పై సమాధానం ఇచ్చారు.