జాతీయ వార్తలు

భారత్-సౌదీ మధ్య హజ్ వార్షిక ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: భారత్, సౌదీ అరేబియా మధ్య 2019 హజ్ ద్వైపాక్షిక వార్షిక ఒప్పందం జరిగింది. సౌదీ రాజధాని జెడ్డాలో గురువారం ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రి మొహమద్ సాలెహ్ బిన్ తెహార్ బెన్‌టెన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. హజ్ యాత్రికుల భద్రత, సదుపాయాల కల్పనకు భారత్ ఎంతో కృషి చేస్తోందని ఈ సందర్భంగా నఖ్వీ స్పష్టం చేశారు. అలాగే సౌదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. భారత్ ప్రధాని మోదీ, సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మార్గదర్శకత్వంలో ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టమవుతున్నాయని ఆయన వెల్లడించారు. సంస్కృతి, చరిత్ర, ఆర్థిక, రాజకీయ సంబంధాలపై ఇరుదేశాలు చేస్తున్న కృషిని మంత్రి గుర్తుచేశారు. 2018 హజ్ యాత్ర విజయవంతం కావడంలో అధ్యక్షుడు సల్మాన్ కృషి ఎంతో ఉందని నఖ్వీ అన్నారు. ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం, పరస్పర సహకారం విషయంలో జెడ్డాలోని భారత్ కాన్సులేట్ సమర్ధవంతంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. 2019 హజ్ యాత్రకు భారీగా మహిళలు వెళ్తారన్న మంత్రి ‘పురుషుని తోడు లేకుండా మహిళా యాత్రికులు మక్కాకు వెళ్తారు’అని ప్రకటించారు. వచ్చే ఏడాది హజ్ యాత్రకు 2100 ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. పురుషుని వెంటబెట్టుకునే మహిళలు హజ్‌యాత్రకు వెళ్లాలన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం 2018లోనే ఎత్తివేసిందని మంత్రి నఖ్వీ స్పష్టం చేశారు.