జాతీయ వార్తలు

జాలర్ల విడుదలకు చొరవ తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: పాకిస్తాన్ కోస్టుగార్డ్స్ అదుపులో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన మత్స్యకారుల విడుదలకు వెంటనే చొరవ తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్‌లో చిక్కుకున్న జాలర్లను వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశంగ మంత్రిత్వ శాఖ అధికారులను ఉపరాష్టప్రతి ఆదేశించారు. ఈ మేరకు ఉపరాష్టప్రతి కార్యాలయం అధికారులు గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. ఇదే అంశంపై వైఎస్సాఆర్‌సీపీ నాయకులు విజయ సాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి తదితరులు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. మత్స్యకారుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రామ్మోహన్‌నాయుడు కూడా మత్య్సకారుల విడుదలకు కేంద్రం చొరవ తీసుకోవాలని సుష్మా స్వరాజ్‌ను వినతి పత్రాన్ని సమర్పించారు. నవంబర్ 28న శ్రీకాకుళం జల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం, శివాజీ దిబ్బపాలెం, బడివానిపేట గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లారు. నాలుగు బోట్లకు చెందిన 21 మంది గుజరాత్ సరిహద్దుల్లో వేటకు వెళ్లారు. వీరిని అక్కడ సరిహద్దులో పాకిస్తాన్ కోస్టుగార్డు వారు అదుపులోకి తీసుకున్నారు.