జాతీయ వార్తలు

రాష్టప్రతి పాలన సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మార్చి 28: రాష్టప్రతి పాలన విధించిన ఉత్తరాఖండ్‌లో బిజెపి అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే మెజార్టీ సాధించగలమని బిజెపి గట్టి విశ్వాసంతో ఉందని ఆయన చెప్పారు. ‘ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు నిర్వహిస్తే బిజెపి మెజార్టీ సాధించడం ఖాయం. అయినా అక్కడ గల అన్ని అవకాశాలపై మా పార్టీ రాష్ట్ర శాఖ చర్చిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని దీనిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ శాసనసభలో విశ్వాస ఓటింగ్ జరగడానికి ముందే ఆ రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించడాన్ని ఆయన సమర్థించుకున్నారు.
ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్టప్రతి పాలన విధించి తన రాజ్యాంగ కర్తవ్యాన్ని నెరవేర్చిందన్నారు. ‘ఉత్తరాఖండ్‌లో పూర్తిస్థాయి రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ విశ్వాస ఓటింగ్‌కు ముందే రాష్టప్రతి పాలన విధించక తప్పలేదు. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’ అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్ తలబిరుసుగా వ్యవహరిస్తూ తమ నాయకులను దారిలో పెట్టుకోవడంలో విఫలమవుతుండటం వల్లనే వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ క్రమంగా ఉనికిని కోల్పోతోందని నక్వీ తెలిపారు.