జాతీయ వార్తలు

పీఏసీకి ఎందుకు సమర్పించలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి మోదీసర్కార్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా సుప్రీం కోర్టు వెలువరించిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన ఈ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని పునరుద్ఘాటించారు. సుప్రీం కోర్టు తన తీర్పులో ఉదహరించినట్టుగా క్యాగ్ నివేదికను పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్‌కమిటీకి ఎందుకు నివేదించలేదని మోదీ సర్కార్‌ను నిలదీశారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం తాము దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నామని, ఇదే జరిగితే ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అనిల్ అంబానీల పేర్లు బయటకు వస్తాయన్నారు. రాఫెల్ వ్యవహారంపై కాగ్ నివేదికను పబ్లిక్ అకౌంట్స్‌కమిటీకి నివేదించినట్టుగా సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్న రాహుల్ ‘అలాంటి నివేదిక ఏదీ కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలోని పీఏసీకి అందలేదు’ అని తెలిపారు. అలాంటప్పుడు కాగ్ నివేదికను ప్రభుత్వం ఎవరికి సమర్పించిందని ప్రశ్నించిన ఆయన ‘ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన మరో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకే దీనిని నివేదించారా’ అని విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందని, ఒక రాఫెల్ వ్యవహారంలోనే 30 వేల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని రాహుల్ అన్నారు.
జేసీపీతో దర్యాప్తు చేయాల్సిందే
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి అంశాన్ని తాము నిర్ణయించలేమని సుప్రీం స్పష్టం చేయడాన్ని బట్టి చూస్తే ఇప్పటివరకు తాము చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టయిందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడిక్కడ స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై వాస్తవాలను వెలికితీయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు చేయాల్సిందేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. రాఫెల్ వ్యవహారంలో అవినీతి అంశాన్ని సుప్రీం కోర్టు నిర్ణయించజాలదని తాము గతంలోనే చెప్పామని, ఈ అవినీతి బాగోతం బయటపడాలంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. ఈ రక్షణ ఒప్పందంలోనే అన్ని అంశాలను లోతుగా పరిశీలించి విధాన నిర్ణాయక ప్రక్రియను, అలాగే గ్యారంటీలను వాస్తవికతతో వెలుగులోకి తేగలిగేది జేపీసీ ఒక్కటేనని ఆయన చెప్పారు. 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి ఈ ఒప్పందానికి సంబంధించి విధాన నిర్ణయక ప్రక్రియను సందేహించాల్సిన పనిలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాట్లాడారు. ఈ ఒప్పందానికి సంబంధించి ధరల్లో తులనాత్మక వివరాలను పరిశీలించడం తమ పని కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేయడాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకుంది. ఈ వ్యవహారంలో అంతా సక్రమంగా జరిగిందని బీజేపీ భావిస్తుంటే మరి జేపీసీ దర్యాప్తుకు వెనుకాడటం ఎందుకని సుర్జేవాలా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఏ స్థాయిలో ఎంత అవినీతి జరిగింది జేపీసీ దర్యాప్తులో బట్టబయలయ్యే అవకాశం ఉందని అన్నారు. రాఫెల్ రక్షణ యుద్ధ విమానాల అంశం కొనుగోలుపై దర్యాప్తు చేయడం తమ పరిధిలోని అంశం కాదని తాజా రూలింగ్ ద్వారా సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం మీడియాపై ఉందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ‘డీపీపీ మార్గదర్శకాలను ప్రధాని ఎందుకు ఉల్లంఘించారు? అలాగే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థనే భాగస్వామిగా ఎందుకు ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు. మొదటి నుంచి తాము జేపీసీ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నామని, ఇప్పటికీ తాము కట్టుబడే ఉన్నామని అన్నారు. ఈ వ్యవహారంలో అధిక మొత్తాన్ని చెల్లించడమే ప్రధాన అంశమని, దీనిపై వ్యాఖ్యానించడానికి సుప్రీం కోర్టు నిరాకరించిందని, అంతేకాకుండా ఇది తమ పరిధిలోని అంశం కాదని కూడా స్పష్టం చేసిందని ఖర్గే అన్నారు.