జాతీయ వార్తలు

ఐబీ డైరెక్టర్, రా సెక్రటరీల పదవీ కాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్, రీసెర్చి అండ్ అనాలిసిస్ వింగ్ కార్యదర్శి అనిల్ కె ధాష్మాన పదవీ కాలం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి పదవీ కాలం వచ్చే నెలతో పూర్తి కావాల్సి ఉంది. రాజీవ్ జైన్ పదవీకాలం డిసెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. ధాఊమన పదవీకాలం డిసెంబర్ 29తోముగుస్తుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీరి పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రధానమంత్రి అధ్యక్షతన అపాయింట్‌మెంట్ కమిటీ కేబినెట్ ఉత్తర్వులు జారీ చేసింది. జైన్ 1980 బ్యాచికి చెందిన జార్ఖండ్ ఐపీఎస్ అధికారి. ఆయనను 2016 డిసెంబర్ 30వ తేదీన ఐబీ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన విశిష్టసేవలు అందించినందుకు రాష్టప్రతి బంగారు పతకంను సాధించారు. ఆయన కాశ్మీర్ వ్యవహారాల విభాగంలో పనిచేశారు. గతంలో ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో కాశ్మీర్ వ్యవహారాల్లో అప్పటి వేర్పాటు వాది షబ్బీర్‌షాతో చర్చలు జరపడంలో క్రియాశీలపాత్రవహించారు. ధాష్మాన 1981 బ్యాచికి చెందతిన ఐపీఎస్ అధికారి. ఆయన రాలో గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. దేశం వెలుపలి కార్యకలాపాల నిఘా సమాచారాన్ని సేకరించడంలో ధాష్మాన దిట్ట.