జాతీయ వార్తలు

రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రధాని మోదీ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ రాఫెల్ ఒప్పందంపై ఆయన ప్రభుత్వం ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి అక్రమాలు జరిగాయని, దానిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటిషన్లన్నీ సుప్రీం కోర్టు కొట్టివేసింది. ‘ఈ ఒప్పంద ప్రక్రియలో అనుమానించడానికి ఏమీ లేదు, అంతా పారదర్శకంగా ఉంది’ అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్‌కె కౌల్, కేఎం జోసఫ్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. 58వేల కోట్లతో 36 ఫైటర్ జట్ల కొనుగోలుకు సంబంధించి భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో అక్రమాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. ‘ఈ ఒప్పందంపై మేము పూర్తి సంతృప్తితో ఉన్నాం.. ఈ ప్రక్రియలో అనుమానించదగ్గదేమీ లేదు.. దీనిపై కోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్‌పై మేము విభేదిస్తున్నాం.. దర్యాప్తు అవసరం లేదని మేము భావిస్తున్నాం. అలాగే విమానాల కొనుగోలుకు సంబంధించి ఒప్పందంలో జోక్యం చేసుకోం’ అని ధర్మాసనం తెలియజేసింది. ఈ సందర్భంగా 36 రాఫెల్ జెట్ల కొనుగోలు ఒప్పందం సెప్టెంబర్ 23, 2016లో జరిగిందని, ఆ సమయంలో దానిపై ఎలాంటి వివాదం లేదని, అయితే దానిపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సోయిస్ హొలాండె భారత్ ఆఫ్‌సెట్ పార్టనర్ ఎంపికలో ఆరోపణలు చేసిని తర్వాతే దీనిపై విమర్శలు, ఆరోపణలు ప్రారంభమయ్యాయని కోర్టు తెలిపింది. వాస్తవానికి ఈ ఒప్పందంలో జెట్ల ధరలు ఎంత అన్న విషయం పరిశీలించే బాధ్యత కోర్టుది ఎంతమాత్రం కాదని, వాటి ప్రస్తుత ధర ఎంత, ఎంతకు కొనుగోలు చేశారు తదితర అంశాలు దేశభద్రతను దృష్టిలో పెట్టుకుని రహస్యంగా ఉంచవచ్చునని తెలిపింది. అలాగే భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)ను కాదని ఫ్రెంచ్‌కు చెందిన డస్సాల్ట్ కంపెనీ ఆఫ్‌సెట్ పార్టనర్‌గా భారత్‌కు చెందిన రిలయన్స్ ఏరో స్ట్రక్చర్ లిమిటెడ్‌ను ఎంచుకుందని, దీనికి భారత ప్రభుత్వ ఒత్తిడే కారణమని, ఇందులో వేల కోట్ల అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై కోర్టు స్పందిస్తూ ఈ విషయంలో భారత్ పక్షపాత వైఖరితో వ్యవహరించి రిలయన్స్‌కు అనుకూలంగా ఒప్పందం కుదిరేలా చేసిందనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంది. అయితే సాంకేతికంగా ఆ సంస్థ భాగస్వామిగా ఉండటానికి సరిపడా సామర్థ్యం కలిగి ఉందా లేదా అనే అంశాన్ని నిర్ధారించే అనుభవం కాని, పరిజ్ఞానం కాని కోర్టుకు లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి మీడియా, ఇతర ప్రదేశాలలో జరిగిన చర్చలు, ఇంటర్వ్యూలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని అన్నారు.