జాతీయ వార్తలు

ఇండియాగేట్ వద్ద ‘పొకె హంట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: పొకెమాన్ గొ గేమ్ జ్వరం హైరేంజ్‌కి చేరుకుంది. పర్ఫార్మెన్స్ కన్సార్టియంకు చెందిన వాలంటీర్లు ఆదివారం ఇండియాగేట్ వద్ద దాదాపు రెండున్నర గంటలపాటు పొకెమాన్ వాక్ నిర్వహించి అరుదైన డిజిటల్ పురుగులను పట్టుకునే కార్యక్రమాన్ని శిక్షకులతో నిర్వహించారు. ‘పొకె హంట్ ఇండియాగేట్ దగ్గర 5గంటలకు మొదలైంది. వీలైనన్ని పొకె బాల్స్‌ను సేకరించేందుకు ఆ ప్రాంతంలో పొకె స్టాప్స్ ఉన్నాయి. ఆ తరువాత హైకోర్టు నుంచి నేషనల్ గేలరీ ఆఫ్ మాడర్‌డ ఆర్ట్, జాకీర్ హుస్సేన్ మార్గ్ మీదుగా ఖాన్ మార్కెట్ వద్ద పూర్తి చేశాం’ అని పర్ఫార్మెన్స్ కన్సార్టియం సహ వ్యవస్థాపకులు మను కామత్ తెలిపారు. రియాల్టీ గేమ్‌లలో అమెరికాలో విడుదలైన ఈ గేమ్ ఇంకా భారత్‌లో అధికారికంగా లాంచ్ కాలేదు.. కానీ ఇప్పటికే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా దేశంలో గేమ్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. విశ్వవ్యాప్తంగా 151 పొకెమాన్‌లు ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు ఆయా పొకెమాన్‌లు రకరకాల పేర్లతో ఉన్నారు. పొకెహంట్‌ను ఫేస్‌బుక్ సృష్టించింది. ఈ హంట్ 40మందితో ప్రారంభమై విశ్వవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో వేలు లక్షల మందికి చేరుకుంది. పిల్లలు, పెద్దలు, యువత తేడా లేకుండా అంతా పొకెమాన్ మానియాలో కొట్టుకుపోతున్నారు. ఇండియాగేట్ దగ్గర చాలా పొకెమాన్‌లు, పొకెస్టాప్‌లు పొకెజిమ్ ఉన్నాయి. ఒకరికొకరు కలిసి ఆటాడుకునే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కామత్ వివరించారు.