జాతీయ వార్తలు

కొలువుదీరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, డిసెంబర్ 14: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 17వ తేదీన సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆనందబెన్ ఈ మేరకు కమల్‌నాథ్‌కు ఆహ్వానం పంపారు. 72 ఏళ్ల కమల్‌నాథ్ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. శుక్రవారం ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ఆనందబెన్‌ను కలిశారు. అనంతరం గవర్నర్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన పార్టీలో అతి పెద్ద ఏకైక పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ నేతగా కమల్‌నాథ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత కమల్‌నాథ్ విలేఖర్లతో మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ సోమవారం భోపాల్‌లోని లాల్ పరేడ్ మైదానంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు.
కమల్‌నాథ్ కేంద్ర మంత్రివర్గంలో అనేక పదవులను నిర్వహించారు. తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికై అందరి మన్ననలు పొందిన కమల్ నాథ్‌కు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, వివేక్ టాంకా, అజయ్ సింగ్, అరుణ్ యాదవ్, సురేష్ పచౌరి మద్దతు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కమల్‌నాథ్ నియమితులయ్యారు. గత నెల 28వ తేదీన జరిగిన ఎన్నికలకు ముందు పార్టీని కమల్‌నాథ్ ముందుండి నడిపించారు. డిసెంబర్ 11వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. కాగా బీఎస్పీ, ఎస్పీ, ఇతర ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి రేసులో జ్యోతిరాధిత్య సింధియా కూడా ఉన్నారు. గతంలో ఆయన తండ్రి మాదవరాజ్‌సింధియాకు కూడా ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి ఎఐసీసీ నిరాకరించింది. 1989లో మాధవరాజ్ సింధియా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం తధ్యమనుకున్నారు.కాని చివరి నిమిషంలో పార్టీలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన వెనక్కుతగ్గాల్సి వచ్చింది. ఆ సమయంలో మోతీలాల్ వోరాను ముఖ్యమంత్రిగా అప్పటి ఎఐసీసీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ నియమించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గిన తర్వాత జ్యోతిరాధిత్య సింధియా కూడా ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. కాగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కమల్‌నాథ్ అభ్యర్థిత్వం వైపే పార్టీ హైకమాండ్ మొగ్గుచూపింది. జ్యోతిరాధిత్య సింధియా నాయనమ్మ జన్‌సంఘ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. జ్యోతిరాధిత్యసింధియా తండ్రి మాధవరావు సింధియా కూడా 1971లో జనసంఘ్‌లో చేరి గెలిచారు. అనంతరం ఆయన 1980లో ఇందిరాగాంధీ విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌కు వచ్చారు. ఆయన సోదరీమణులు వసుంధరరాజె, యశోధర రాజె తల్లి అడుగుజాడల్లో బీజేపీలో చేరారు. వసుంధర రాజె రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం విదితమే.