జాతీయ వార్తలు

తగ్గిపోతున్న పార్శీ జనాభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: దేశంలో అత్యంత సంపన్న వర్గంగా భావించే పార్శీ జనాభా గత పదేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. 2001లో 69వేలపై చిలుకు ఉన్న ఈ జనాభా 2011 నాటికి 22శాతం తగ్గి 57వేలకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో పార్శీలు కేవలం వందల సంఖ్యలోనే ఉన్నట్టు తాజా గణాంక వివరాలను బట్టి తెలుస్తోంది. ఢిల్లీలో కనిష్ఠ స్థాయిలో పార్సీలు కేవలం 221 మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో 609మంది, కర్నాటకలో 443మంది, పశ్చిమ బెంగాల్‌లో 291, జార్ఖండ్‌లో 127మంది, ఉత్తరప్రదేశ్‌లో 85మంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. మొదటినుంచీ పార్శీలకు మంచి పట్టున్న మహారాష్టల్రో వీరి జనాభా అత్యధిక స్థాయిలో 44,854 కాగా గుజరాత్‌లో 9727. జనాభా తక్కువే అయినప్పటికీ వ్యాపార రంగాల్లో విశేషంగా పార్సీలు దశాబ్దాలుగా రాణిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఇంతభారీగా వీరి జనాభా తగ్గడం గతంలో ఎన్నడూ జరగలేదు.