జాతీయ వార్తలు

కుట్రే కారణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 15: చామరాజ్‌నగర్ జిల్లాలోని ఆలయంలో ప్రసాదం తిని 11 మంది మృతి చెందిన కేసులో కుట్ర కోణంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విష తుల్యమైన ప్రసాదాన్ని తినడం వల్ల వీరు మరణించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మరో 93 మందిని ఆస్పత్రిలో చేర్పించినట్లు చామరాజ్‌నగర్ ఎస్పీ ధర్మేందర్ సింగ్ మీనా చెప్పారు. ముగ్గురు వంటవాళ్లని కూడా ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కిచిగుట్టి మారమ్మ దేవాలయంలో రెండువర్గాల మధ్య పోరు వల్ల ఈ విషాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రసాదానికి సంబంధించి ఆహార శాంపిల్స్‌ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పరీక్షల నిమిత్తం పంపారు. నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెల్లడవుతాయని పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లావైద్యాధికారి ప్రసాద్ మాట్లాడుతూ ప్రసాదంలో విషం కలిపారన్నారు. దీని వల్లనే విషాదం సంభవించిందన్నారు. కాగా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. బెల్గావిలో కర్నాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రత్యేక విమానంలో చామరాజ్‌నగర్‌కు చేరుకున్నారు. ఈ కేసులో బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు.