జాతీయ వార్తలు

రాజస్థాన్ కొత్త ఎమ్మెల్యేల్లో 158మంది కోటీశ్వరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 15: రాజస్థాన్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 199 ఎమ్మెల్యేల్లో 158 మంది కోటీశ్వరులే. 2013 ఎన్నికల్లో నెగ్గిన వారిలో 145 మందే కోటీశ్వరులు. ఇటీవల ఎన్నికల్లో అదనంగా 13 మంది కోటీశ్వరులున్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన 99 మందిలో 82 మంది కోటీశ్వరులున్నారు. బీజేపీ నుంచి 73 మంది నెగ్గగా అందులో 58 మంది కోట్లకు పడగలెత్తినవారే. 13మంది ఇండిపెండెండ్ ఎమ్మెల్యేల్లో 11 మంది, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు కోటీశ్వరులు. నామినేషన్ల దాఖలు సమయంలో అందజేసిన అఫిడవిట్ ఆధారంగా ఈ వివరాలు వెల్లడించారు. ధనికులైన కొత్త ఎమ్మెల్యేల్లో ఐటీ రిటర్న్ విషయం పరిశీలిస్తే పరసరామ్ మొర్డియా (172), ఉదయ్‌లాల్ అంజనా (107), రాకేష్ మీనా(39) కోట్లుకు ఐటీ రిటర్న్ దాఖలు చేసినట్టు ఏడీఆర్ పేర్కొంది. యువ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ రాత్, ముకేష్ కుమార్ భాకర్, రామ్‌నివాస్ గవారియా ఆస్తులు అత్యల్పం. ఏడీఆర్ నివేదిక ప్రకారం గెలిచిన వారిలో 59 మంది విద్యార్హతలు 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నాయి. 129 మంది గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఏడుగురికి ఎలాంటి విద్యార్హతలూ లేవు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 199 మంది శాసన సభ్యుల్లో 23 మంది మహిళలున్నారు. రద్దయిన అసెంబ్లీలో మహిళల సంఖ్య 28.