జాతీయ వార్తలు

మోదీకి సాటి వచ్చే నేత ఎవరూ లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశంలో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ నాయకత్వాన్ని సవాలు చేసే వారు, పోటీ పడే నాయకుడు ఎవరూలేరని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. మోదీకి మిగతా నేతలకు మధ్య పోటీ లేదని, మోదీకి ఎవరూసాటిరారన్నారు.
గతనాలుగున్నరేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దామని, గాడి తప్పిపరిపాలనలో ఒక సక్రమమైన మార్గంలో పెట్టామని ఆయన చెప్పారు. విపక్షాలు మోదీ పాలన చూసి అసూయతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కాని ప్రజలు వీరి మాటలను నమ్మరన్నారు. విపక్షాలకు సరైన నేత లేరని, వారిలో వారు కీచులాడుకోవడం మొదటి నుంచి అలవాటన్నారు.
ఒక స్పష్టమైన అజెండాతో దేశాన్ని సరైన మార్గంలో పెడుతున్న మోదీని చూసి సర్వత్రా ప్రజలు ఆమోదం తెలుపుతున్నాన్నారు. మోదీ సంక్షేమ విధానాలను జనంలోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. సంక్షేమ ఫలాలు జనానికి అందుతున్నాయని, వీటి గురించి జనంలో అవగాహన పెంచాలన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, మోదీ నిష్కలంక పాలనతో విపక్షాలు బెంబేలెత్తుతున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి బీజైవైఎం జాతీయాధ్యక్షుడు ఎంపీ పూనమ్ మహజన్ అధ్యక్షత వహించారు. సామాజిక మాద్యమాలు, జనం ద్వారా మోదీ ప్రభుత్వ విజయాలపై ఉధృతంగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు.