జాతీయ వార్తలు

రక్షణ.. కాంగ్రెస్‌కు భక్షణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: జాతీయ రక్షణ, భద్రతల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విలువా లేదని, వీటిని విమర్శలు గుప్పించేందుకో లేదా అవినీతి ద్వారా నిధులను సమకూర్చుకునేందుకో వాడుకుంటూనే ఉందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.
ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెన్నైలోని బీజేపీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడిన మోదీ పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రాలను ఏరివేసేందుకు తమ ప్రభుత్వం జరిపిన సర్జికల్ దాడులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం ఈ దాడులు నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలకు వీటిని తప్పుబట్టడం, విమర్శించడమే పనిగా మారిందన్నారు. అలాగే రక్షణ కొనుగోళ్లన్నవి కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలుగా మారాయని, 1940నాటి జీపు స్కామ్ నుంచి తాజాగా బోఫోర్స్, అగస్టా, జలాంతర్గాముల కొనుగోళ్లు వివాదాస్పదం కావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఏ విధంగా సొమ్ము చేసుకోవాలన్నదే కాంగ్రెస్ నాయకుల ఏకైన లక్ష్యమని, ఇందుకోసం సైనిక దళాల ఆత్మస్థయిర్యాన్ని పణంగా పెట్టేందుకూ ఆ పార్టీ వెనుకాడదని మోదీ అన్నారు. భారత సైన్యం అందిస్తున్న సేవలకు తామెంతో గర్వపడుతున్నామని, వాటి సామర్థ్యం పట్ల తమ ప్రభుత్వానికి పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉన్నాయని మోదీ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్జికల్ దాడులు ప్రచారాస్త్రాలుగా మారిన విషయం తెలిసిందే. 2016లో జరిగిన ఈ దాడులపై కాంగ్రెస్ పార్టీ అనేక సందేహాలనూ వ్యక్తం చేస్తూ వస్తోంది. భారత సైనిక దళాల సత్తా చాటిన ఆ దాడులను విమర్శించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై ప్రధాని మోదీ తీవ్ర పదజాలంతో ధ్వమెత్తారు కూడా.