జాతీయ వార్తలు

అయోధ్య రామాలయం నిర్మాణానికి శాసనం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, డిసెంబర్ 16: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి కేంద్రం పార్లమెంటులో శాసనం చేయాలని విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ధర్మసభ డిమాండ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేలోగా బిల్లును ప్రవేశపెట్టి శాసనం తేవాలని ధర్మసభ కోరింది. అఖిల భారత సంత్ సమితి ప్రతినిధి జగద్గురు రామానందచార్య స్వామి హన్సదేవాచార్య మహారాజ్ మాట్లాడుతూ రామాలయం కోసం అంతిమ పోరాటం చేయాలన్నారు. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య ప్రయాగరాజ్‌లో జరిగే సమావేశాల్లో తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. దేవాలయంలో ఉపయోగించే శిలలను చెక్కుతున్నారని, ఈ కార్యక్రమం త్వరలో పూర్తవుతుందన్నారు.
ఈ పనిపూర్తయిన వెంటనే ఎవరూ కూడా ఆలయ నిర్మాణాన్ని ఆపలేరన్నారు. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొని అంతిమ పోరాటాన్ని ప్రారంభిస్తామన్నారు. దేశంలోని 543 నియోజకవర్గాల్లో వీహెచ్‌పీ నేతలు పర్యటిస్తారన్నారు. ఆరు లక్షల గ్రామాల్లో ధర్మసభలను నిర్వహిస్తారన్నారు. అయోధ్యకు వెళ్లి రామాలయం నిర్మించే విషయమై తేదీని ప్రయాగరాజ్‌లో ఖరారు చేస్తామన్నారు. బాబ్రీమసీదు కూల్చేందుకు తాము ఎవరి అనుమతి తీసుకోలేదన్నారు. రామాలయం నిర్మాణానికి కూడా ఎవరి అనుమతి అక్కర్లేదన్నారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించమన్నారు. అయోధ్యలో రామాలయం ఒక్కటే నిర్మించాలని, పరిసరాల్లో మసీదును నిర్మించేందుకు వీలు లేదన్నారు. వీహెచ్‌పీ కేంద్ర కార్యదర్శి రాజేందర్ సింగ్ పంకజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఆలస్యమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు.
చిత్రం..విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ధర్మసభలో ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం